Viva Harsha : బ్యాచిలర్‌ లైఫ్‌కు గుడ్‌బై చెప్పేసిన వైవా హర్ష!

Viva Harsha : బ్యాచిలర్‌ లైఫ్‌కు గుడ్‌బై చెప్పేసిన వైవా హర్ష!
టాలీవుడ్ కమెడియన్ వైవా హర్ష తన బ్యాచిలర్‌ లైఫ్‌కు గుడ్ బై చెప్పేశాడు. నిన్న శనివారం అక్షర అనే అమ్మాయితో వైవా హర్ష నిశ్చితార్థం జరిగింది.

టాలీవుడ్ కమెడియన్ వైవా హర్ష తన బ్యాచిలర్‌ లైఫ్‌కు గుడ్ బై చెప్పేశాడు. నిన్న శనివారం అక్షర అనే అమ్మాయితో వైవా హర్ష నిశ్చితార్థం జరిగింది. ఈ మేరకు హర్ష తన సోషల్ మీడియాలో ఓ ఫోటోను పోస్ట్ చేస్తూ.. 'చివరి బ్యాచిలర్‌ సెల్ఫీ' అని క్యాప్షన్‌ రాసుకొచ్చాడు. ప్రస్తుతం వైవా హర్ష, అక్షరల నిశ్చితార్థం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనితో వైవా హర్షకి అభిమానులు, సినీ తారలు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు చెబుతున్నారు. అయితే పెళ్ళెప్పుడు అన్నది మాత్రం హర్ష ఇంకా వెల్లడించలేదు. అటు వైవా హర్ష షార్ట్ ఫిలిమ్స్ ద్వారా బాగా క్లిక్ అవ్వడంతో సినిమాల్లో మంచి అవకాశాలు వచ్చాయి. తాజాగా కలర్‌ ఫొటో అనే చిత్రంలో నటించి మెప్పించాడు హర్ష !



Tags

Read MoreRead Less
Next Story