Trivikram : మహేష్, త్రివిక్రమ్ సినిమాలో ఫెడ్ అవుట్ హీరోయిన్..!

Trivikram : మహేష్, త్రివిక్రమ్ సినిమాలో ఫెడ్ అవుట్ హీరోయిన్..!
సూపర్ స్టార్ మహేష్‌‌‌బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌‌‌‌లో ముచ్చటగా మూడో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

సూపర్ స్టార్ మహేష్‌‌‌బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌‌‌‌లో ముచ్చటగా మూడో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరి కాంబినేషన్‌‌‌‌లో వచ్చిన అతడు, ఖలేజా చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. హారిక హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. అయితే ఈ సినిమా కోసం దర్శకుడు త్రివిక్రమ్ హీరోయిన్ త్రిషాను సంప్రదించారట.

ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్‌‌‌కి స్కోప్ ఉండడంతో మొదటి హీరోయిన్‌‌‌గా ఇప్పటికే పూజా హెగ్డేను తీసుకున్న త్రివిక్రమ్.. సెకండ్ హీరోయిన్ పాత్రకోసం త్రిషాను సంప్రదించారని తెలుస్తోంది. ప్రస్తుతం హీరోయిన్‌‌‌‌గా త్రిషా టోటల్ గా ఫెడ్ అవుట్ అయిపోయింది. ఈ క్రమంలో ఈ మాటల మాంత్రికుడు త్రిషాను తీసుకోవడం ఆశ్చరాన్ని కలిగిస్తుంది. గతంలో మహేష్, త్రిషా హీరోహీరోయిన్లుగా త్రివిక్రమ్.. అతడు అనే సినిమాని తెరకెక్కించారు.

కాగా ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా మహేష్-త్రివిక్రమ్ కొత్త సినిమా గ్రాండ్‌‌‌గా లాంచ్ కానుంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం మహేష్.. పరుశురాం దర్శకత్వంలో సర్కారు వారీ పాట అనే చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

Tags

Read MoreRead Less
Next Story