Hero Ram : హీరో రామ్ ఇంట విషాదం.. !

Hero Ram : టాలీవుడ్ సినీ హీరో పోతినేని రామ్ ఇంట విషాదం నెలకొంది. అనారోగ్యంతో రామ్ తాతయ్య మంగళవారం కన్నుమూశారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా రామ్ వెల్లడించారు.

Hero Ram : హీరో రామ్ ఇంట విషాదం.. !
X

Hero Ram : టాలీవుడ్ సినీ హీరో పోతినేని రామ్ ఇంట విషాదం నెలకొంది. అనారోగ్యంతో రామ్ తాతయ్య మంగళవారం కన్నుమూశారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా రామ్ వెల్లడించారు. ఈ సందర్భంగా రామ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు." విజయవాడలో ఓ సాధారణ లారీ డ్రైవర్ గా మీ జీవితాన్ని ప్రారంభించి.. ఉన్నత శిఖరాలకు వెళ్లిన మీ జీవితం మాకు ఎన్నో పాఠాలను నేర్పించింది... మీ పిల్లలు అందరూ ఉన్నతస్థానంలో ఉన్నారంటే దానికి మీరే కారణం... జేబులో ఉన్న డబ్బును బట్టి ఎవరు ధనవంతులు కాలేరు.. కేవలం మంచి మనసున్న ప్రతి ఒక్కరు ధనవంతులవుతారని మీరే మాకు నేర్పించారు. మీ మనసు రాజు లాంటిది.. మీ మరణవార్త నన్నెంతో కలచి వేసింది. మీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తున్నాను.. " అని రామ్ ట్వీట్ చేశాడు.

Next Story

RELATED STORIES