మణిరత్నం హీరోయిన్.. ఇప్పుడు అస్సలు గుర్తుపట్టలేం..!

లవ్ మూవీస్‌‌లో మైల్డ్‌‌స్టోన్ గా మిగిలిపోయిన సినిమాలలో గీతాంజలి సినిమా ఒకటి. మణిరత్నం దర్శకత్వంలో నాగార్జున హీరోగా వచ్చిన ఈ సినిమా లవ్‌‌బర్డ్స్‌‌కి ఫేవరేట్ మూవీగా నిలిచింది.

మణిరత్నం హీరోయిన్.. ఇప్పుడు అస్సలు గుర్తుపట్టలేం..!
X

లవ్ మూవీస్‌‌లో మైల్డ్‌‌స్టోన్ గా మిగిలిపోయిన సినిమాలలో గీతాంజలి సినిమా ఒకటి. మణిరత్నం దర్శకత్వంలో నాగార్జున హీరోగా వచ్చిన ఈ సినిమా లవ్‌‌బర్డ్స్‌‌కి ఫేవరేట్ మూవీగా నిలిచింది. మణిరత్నం తెలుగులో నేరుగా దర్శకత్వం వహించిన ఏకైక చిత్రం ఇదే కావడం విశేషం. ఇళయరాజా స్వరకల్పనలో వేటూరి రాసిన ప్రతి పాట ఓ ఆణిముత్యమే.. ఇందులో నాగార్జున పెయిర్‌‌గా నటించింది గిరిజ.

ఆమె తెలుగులో చేసిన ఏకైక సినిమా కూడా ఇదే కావడం విశేషం. గిరిజ అసలు పేరు గిరిజ ఎమ్మా జేన్ షెత్తార్. క్రికెటర్ శ్రీకాంత్ చెల్లితో కలిసి మణిరత్నం, సుహాసినిల పెళ్లికి హాజరైంది గిరిజ. అక్కడ ఆమెను చూసిన మణిరత్నం.. నా సినిమాలో నటిస్తారా అని అడిగారు. ఆమె కూడా ఒప్పేసుకుంది. అలా గీతాంజలి చిత్రంలో హీరోయిన్‌‌గా సెలెక్ట్ అయింది. కళ్లతోనే హావభావాలు పలికించి ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసింది.

ఆమె చేసింది ఈ ఒక్క సినిమానే కానీ ఓ వంద సినిమాల గుర్తింపు వచ్చింది. మలయాళంలో మరికొన్ని సినిమాలు చేసిన గిరిజ ఆ తర్వాత పెళ్లి చేసుకొని లండన్ లో సెటిల్ అయింది. అక్కడ ఆరోగ్యం సంబంధాలపై జర్నలిస్ట్‌గా పనిచేస్తుంది.

Next Story

RELATED STORIES