Tollywood Movies: కళకళలాడుతున్న థియేటర్లు.. వారానికి ఒక సినిమా కాదు.. ఒక్కరోజే పన్నెండు సినిమాలు

Tollywood Movies: కళకళలాడుతున్న థియేటర్లు.. వారానికి ఒక సినిమా కాదు.. ఒక్కరోజే పన్నెండు సినిమాలు
Tollywood Movies:

టాలీవుడ్ లో ఈ శుక్రవారం పన్నెండు సినిమాలు విడుదలయ్యాయి. ముందుగా ఇన్ని సినిమాలకు థియేటర్స్ ఎలా అనే భావన అందరిలోనూ ఉంది. పైగా బావున్న సినిమాలకూ సమస్యలు వస్తాయనుకున్నారు. ఎన్ని సమస్యలు ఉన్నా.. కొన్ని సినిమాలు ఆడియన్స్ ను ఆకట్టుకోవడంలో సూపర్ సక్సెస్ అయ్యాయి. సందీప్ కిషన్.. 'ఏ ఒన్ ఎక్స్‌ప్రెస్' సూపర్ హిట్ అనిపించుకుంటే.. మిగతావి కూడా అనూహ్యంగా పాజిటివ్ టాక్ తెచ్చుకుని దూసుకుపోతున్నాయి.

సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన సినిమా 'ఏ ఒన్ ఎక్స్‌ప్రెస్'. ఫస్ట్ టైమ్ తెలుగు తెరపై వచ్చిన హాకీ బ్యాక్ డ్రాప్ మూవీ ఇది. స్పోర్ట్స్ డ్రామా అంటే ప్రేక్షకుల్లో తెలియకుండానే ఓ క్రేజ్ ఉంటుంది. ఆ ఆసక్తికి ఏ మాత్రం తగ్గకుండా ఆకట్టుకుంది 'ఏ ఒన్ ఎక్స్‌ప్రెస్'. ఫస్ట్ హాఫ్ రొమాంటిక్ లవ్ స్టోరీగా సాగినా.. ఇంటర్వెల్ ట్విస్ట్ తో సర్ ప్రైజ్ చేసింది టీమ్. ఇక సెకండ్ హాఫ్ అంతా చాలా అంటే చాలా గ్రిప్పింగ్ నెరేషన్ తో సూపర్బ్ అనిపించుకుందీ చిత్రం.

స్పోర్ట్స్ మూవీస్ గెలవడం ఇంపార్టెంట్ అని అందరికీ తెలుసు. ఇది బయోపిక్ కాదు కాబట్టి ఖచ్చితంగా గెలుస్తారు అనే అనుకుంటారు. బట్.. ఆటలో గెలవడమే కాదు.. దాని చుట్టూ ఉన్న అనేక అడ్డంకులను సైతం గెలుచుకుంది 'ఏ ఒన్ ఎక్స్‌ప్రెస్'. ఆటకు ఎమోషన్ మిక్స్ అయి.. ఆకట్టుకునే కథనంతో రూపొందిన ఈ సినిమాతో సందీప్ కిషన్ ఖాతాలో మరో సూపర్ హిట్ పడినట్టే అనిపించుకుంటున్నాడు. నటన పరంగానూ సందీప్ మరో మెట్టు పైకి ఎక్కాడు.

ఇక పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన మరో సినిమా 'షాదీ ముబారక్'. టీవీ నటుడిగా మాస్ ఇమేజ్ ఉన్న సాగర్ హీరోగా నటించిన సినిమా ఇది. కొత్త దర్శకుడు రూపొందించాడు. కాకపోతే దిల్ రాజు బ్యాక్ ఎండ్ లో ఉండటం 'షాదీ ముబారక్' కు కలిసొచ్చింది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ చిత్రం ఆద్యంతం నవ్వులు పూయించింది. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా టాక్ తెచ్చుకుంది.

పెళ్లి చూపుల కోసం వచ్చిన ఓ ఎన్నారై కుర్రాడికి తోడుగా ఓ మ్యారేజ్ బ్యూరో తన కూతురును తోడుగా పంపిస్తాడు. ఒకే రోజు మూడు పెళ్లి చూపులకు వెళ్లే ఉద్దేశ్యంతో ప్రయాణం మొదలుపెట్టిన ఆ ఎన్నారైకి ఈ అమ్మాయి మధ్య జరిగిన సంఘటనలు నవ్వులు పండిస్తే.. ఆ తర్వాత ప్రేమకథ ఆకట్టుకునేలా సాగి అలరిస్తుంది. గతంలో వచ్చిన పెళ్లి చూపులు స్థాయి సినిమా అనే టాక్ వినిపిస్తోందీ చిత్రానికి. సో.. షాదీ ముబారక్ తో ఈ బుల్లితెర హీరో వెండితెరపైన తొలి హిట్ అందుకున్నాడు.

చాలా చిన్న సినిమాగా వచ్చిన మరో మూవీ 'ప్లే బ్యాక్'. టీజర్, ట్రైలర్ తోనే వైవిధ్యమైన సినిమా అనిపించుకుందీ ప్లే బ్యాక్. ఇండియాలో ఈ తరహా కథనంతో వచ్చిన సినిమాలు లేవనే చెప్పాలి. హాలీవుడ్ రేంజ్ టేకింగ్ తో పాటు అద్భుతమైన స్క్రీన్ ప్లే రూపొందిన 'ప్లే బ్యాక్' నిజంగానే ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తుంది. రెండు వేర్వేరు కాలాలకు చెందిన పాత్రలు ఒకే టైమ్ లో కలుసుకోవడం అనే క్లిష్టమైన కథను సరళమైన కథనంగా మార్చి దర్శకుడు హరి ప్రసాద్ జక్కా ఆడియన్స్‌ని ఆకట్టుకున్నాడు.

1993లో ప్రారంభయ్యే కథ.. తర్వాత ఈ కాలానికి వస్తుంది. ఈ రెండు కాలాలను కలుపుతూ.. పాతకాలం నాటి టెలీఫోన్ ఉంటుంది. ఆ ఫోన్ ద్వారా అనేక అంశాలు తెలుసుకున్న నేటి హీరో.. ఆ కాలంలో జరిగిన నాలుగు హత్యలను తెలుసుకుంటాడు. అక్కడి నుంచి ఆ కాలం నాటి అమ్మాయి తన తల్లిలాంటిది అని తెలుసుకుని.. ఆ హత్యలను ఆపే ప్రయత్నం చేస్తాడు. మరి గతాన్ని మార్చాలనుకున్న అతని ప్రయత్నం ఫలించిందా లేదా అనేది మిగతా కథ. ఖచ్చితంగా వైవిధ్యమైన సినిమాలనే కాదు.. రెగ్యులర్ మూవీస్ ను ఇష్టపడేవారిని కూడా అలరించే సినిమా 'ప్లే బ్యాక్'.

మొత్తంగా ఈ మూడు సినిమాలూ మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి. ఇక కెరీర్ లో ఫస్ట్ టైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా చేసిన రాజ్ తరుణ్ మూవీకి మిక్స్ డ్ టాక్ వినిపిస్తోంది. ఇన్ని సినిమాల మధ్య పూర్తి రిజల్ట్ రావడానికి కాస్త టైమ్ పట్టొచ్చేమో కానీ.. ఈ వారం మాత్రం టాలీవుడ్ కు మరీ బ్యాడ్ అయితే కాదంటున్నారు. మరి ఇంత పోటీలో కూడా టాప్‌లో నిలబడి టాప్ లేపేస్తున్న సినిమాలంటే 'ఏ ఒన్ ఎక్స్ ప్రెస్', 'షాదీ ముబారక్' సినిమాలే అని చెప్పుకోవాలి.

Tags

Read MoreRead Less
Next Story