Film Producer B.A.Raju: నిర్మాత, సీనియర్ సినీ పీఆర్వో కన్నుమూత

Film Producer B.A.Raju: తెలుగు చలన చిత్ర నిర్మాత, 1500 చిత్రాలకు పైగా పీఆర్వోగా పని చేసిన బిఎ రాజు కార్డియాక్ అరెస్ట్ కారణంగా హైదరాబాద్ లో శుక్రవారం కన్నుమూశారు. ఆయన వయసు 62. ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు. "సుగర్ లెవల్స్ లో హెచ్చుతగ్గులతో పాటు, గుండెపోటు కారణంగా తండ్రి మరణించారని అతని కుమారుడు శివ కుమార్ ట్వీట్ చేశారు.
"తీవ్ర దుఖంతో మా ప్రియమైన తండ్రి శ్రీ రాజు యొక్క అకాల మరణాన్ని తెలియజేయుటకు చింతిస్తున్నాము. డయాబెటిస్, మరియు కార్డియాక్ అరెస్ట్ కారణంగా ఆయన కన్నుమూశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి.
నాన్నా మీరు ఎప్పటికీ "రాజు" గానే ఉండండి. ఎందుకంటే మీరు మా హృదయాలలో "సూపర్ హిట్'' అని అతడు ట్వీట్ చేశాడు. రాజు 'సూపర్ హిట్' పేరుతో సినీ పత్రికను స్థాపించి విజయవంతంగా నడిపించారుజ కాగా, రాజు భార్య జయ రెండేళ్ల క్రితం మరణించారు. ఆమె దర్శకత్వం వహించిన పలు చిత్రాలకు రాజు నిర్మాతగా వ్యవహరించారు.
రాజు మరణ వార్త విని పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు. రాజమౌళి, మహేష్ బాబు, చిరంజీవి, తారక్, ప్రభాస్, సమంత, తమన్నా ఇంకా పలువురు ఇండస్ట్రీకి చెందిన పెద్దలు, తారలు రాజుతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. మహేష్ బాబు తమ కుటుంబంలోని ఒక వ్యక్తిగా రాజు ఉండేవారని, ఆయన మరణం తమకు తీరని లోటని ట్వీట్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com