కరోనాతో టాలీవుడ్ సీనియర్ గాయకుడు మృతి.. చిరంజీవి సంతాపం..!

కరోనాతో టాలీవుడ్ సీనియర్ గాయకుడు మృతి.. చిరంజీవి సంతాపం..!
టాలీవుడ్ సీనియర్ ప్లేబ్యాక్ సింగర్ జి.ఆనంద్ (67) గతరాత్రి కరోనాతో కన్నుమూశారు. కొంతకాలంగా కరోనాతో బాధపడుతున్న ఆయనను ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది.

టాలీవుడ్ సీనియర్ ప్లేబ్యాక్ సింగర్ జి.ఆనంద్ (67) గతరాత్రి కరోనాతో కన్నుమూశారు. కొంతకాలంగా కరోనాతో బాధపడుతున్న ఆయనను ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. ఆయన స్వస్థలం శ్రీకాకుళం జిల్లా తులగాం. స్వరమాధురిసంస్థ స్థాపించి 6,500కు పైగా కచేరీలు చేశారు. 'ఒక వేణువు వినిపించెను', 'దిక్కులు చూడకు రామయ్య' వంటి పాటలను పాడారు. 'పండంటి కాపురం', 'ప్రాణం ఖరీదు' తదితర చిత్రాల్లోనూ తన గాత్రంతో అలరించారు.

జి. ఆనంద్ మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి సంతాపం తెలిపారు. "ఎన్నియల్లో.. ఎన్నీయల్లో ... ఎందాకా ...అంటూ నా సినీ జీవితంలో తొలి పాటకి గాత్ర దానం చేయడం ద్వారా నాలో ఒక భాగమైన మృదు స్వభావి, చిరు దరహాసి శ్రీ జి.ఆనంద్‌ గారు కర్మశమైన కరీనా బారిన పడి ఇక లేరని నమ్మలేకపోతున్నాను. మొట్టమొదటి సారి వండి తెరమీద ఆయన గొంతు పాడిన పాటకే నేను నర్తించాననే విషయం, ఆయనతో నాకు ఒక అనిర్వచనీయమైన, అవినాభావ బంధం ఏర్పరిచింది. ఆయన ప్రస్థానం నన్ను వెన్నాడే విషాదం. ఆయన కుటుంబ సభ్యులందరికీ నా సంతాపం తెలియచేసుకుంటున్నాను" అని ట్వీట్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story