Pedarayudu : 'పెదరాయుడు' సినిమాని వదులుకున్న స్టార్ డైరెక్టర్..!

Pedarayudu : పెదరాయుడు సినిమాని వదులుకున్న స్టార్ డైరెక్టర్..!
Pedarayudu : మోహన్ బాబు, సౌందర్య, భానుప్రియ ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన చిత్రం పెదరాయుడు.. రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 1995లో విడుదలై ఇండస్ట్రీ హిట్ కొట్టింది.

Pedarayudu : మోహన్ బాబు, సౌందర్య, భానుప్రియ ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన చిత్రం పెదరాయుడు.. రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 1995లో విడుదలై ఇండస్ట్రీ హిట్ కొట్టింది. తమిళంలో సూపర్ హిట్టైన 'నాట్టామై' సినిమాకి ఇది రీమేక్ కావడం విశేషం. ఈ సినిమాకి ముందు వ‌రుస అప‌జ‌యాల‌తో ఉన్న మోమ‌న్ బాబుకి పెదరాయుడు బ్లాక్ బస్టర్ హిట్‌‌ని ఇచ్చింది.

ఈ సినిమా కోసం మోహ‌న్‌బాబు త‌న ఆస్తుల‌న్నీ కుదువ‌పెట్టారు. ఈ సినిమా రిమేక్ హక్కులను ఇప్పించడంతో పాటుగా సినిమాలో మోహన్ బాబుకి తండ్రి పాత్ర పోషించి ఎలాంటి రెమ్యున‌రేష‌న్ తీసుకోలేదు రజినీకాంత్. ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకి బ్రహ్మారధం పట్టారు. ఈ సినిమా ఆడిన‌న్ని రోజులు థియేట‌ర్లన్నీ ప్రేక్షకుల‌తో కిట‌కిట‌లాడడం విశేషం. అప్పటివరకు చిరంజీవి ఘ‌రాన మొగుడు సినిమా పైన ఇండస్ట్రీ రికార్డును పెదరాయుడు తిరగరాసింది.

అయితే ఈ సినిమాకి ముందుగా దర్శకుడిగా బి గోపాల్ అని అనుకున్నారు మోహన్ బాబు. అప్పటికే వెంకటేష్, త్రివిక్రమరావు కాంబినేషన్ లో ఓ సినిమాకి ఆయన కమిట్ అవ్వడంతో పెదరాయుడు చిత్రాన్ని వదులుకున్నారు. దీనితో రవిరాజా పినిశెట్టి ఈ సినిమాని చేశారు. పెదరాయుడు లాంటి బ్లాక్ బస్టర్ సినిమాని వదులుకున్నావ్ అని అప్పుడప్పుడు మోహన్ బాబు అంటుంటారని గోపాల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ సినిమాతో పాటుగా గోపాల్ ఎన్టీఆర్ సింహాద్రి సినిమాని మిస్ చేసుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story