కొత్త తరహాలో ప్లే బ్యాక్ మూవీ ప్రమోషన్స్..!

కొత్త తరహాలో ప్లే బ్యాక్ మూవీ  ప్రమోషన్స్..!
టాలీవుడ్ టాప్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన 100%లవ్, వన్ నేనొక్కడినే చిత్రాలకు స్క్రీన్ ప్లే అందించిన హరిప్రసాద్ జక్కా దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం 'ప్లేబ్యాక్'.

టాలీవుడ్ టాప్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన 100%లవ్, వన్ నేనొక్కడినే చిత్రాలకు స్క్రీన్ ప్లే అందించిన హరిప్రసాద్ జక్కా దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం 'ప్లేబ్యాక్'.. దినేష్ తేజ్, అనన్యా నాగళ్ల హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో ప్రముఖ జర్నలిస్ట్ టీవీ 5 మూర్తి కీలక పాత్ర పోషించారు.

శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కిన ఈ సినిమాని మార్చి 05 న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అయితే సినిమా విడుదల తేది దగ్గర పడుతుండడంతో చిత్ర యూనిట్ కొత్త తరహాలో ప్రమోషన్స్ ను మొదలు పెట్టింది. అందులో భాగంగానే ఓ విలేజ్ నేపథ్యంలో కొంతమంది నటులుతో పదమూడు నిమిషాలతో ఉన్న వీడియోని తీసి యూ ట్యూబ్ లో అప్లోడ్ చేసింది.


ఈ వీడియో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ విడుదలవ్వగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. తొలి క్రాస్ టైమ్ కనెక్షన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా పైన అభిమానుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

Play Back Movie Cast and Crew :

CAST : దినేష్ తేజ్, అర్జున్ కల్యాణ్, స్పందన, అనన్య నాగల్లా, కార్తికేయ కృష్ణ మల్లాడి, అశోక్ వర్ధన్, టిఎన్ఆర్, టీవీ5 మూర్తి, చక్రపాణి ఆనంద, ఐశ్వర్య లక్ష్మి, 'తాగుబోతు' రమేష్, గౌతమ్ రాజు, దీప్తి, జెన్ విష్ణు.

CREW:

నిర్మాత: ప్రసాద్రావు పెద్దినేని

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: హరి ప్రసాద్ జక్కా

క్రియేటివ్ ప్రొడ్యూసర్: డిజె

డీఓపీ: కె బుజ్జీ

సంగీతం: కమ్రాన్

ఆర్ట్ : జెవి

ఎడిటింగ్: బొంతల నాగేశ్వర రెడ్డి

ప్రోమోలు: రవిశంకర్

స్టంట్స్: దేవరాజ్

పీఆర్‌ఓ: వంశీ శేఖర్

విడుదల తేది : మార్చి 5, 2021


Tags

Read MoreRead Less
Next Story