పవన్ ఈజ్ బ్యాక్.. 'వకీల్ సాబ్' అదుర్స్.. ట్విట్టర్ రివ్యూ

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా నిన్న గురువారం రాత్రి ఓవర్సీస్‌లో విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది.

పవన్ ఈజ్ బ్యాక్.. వకీల్ సాబ్ అదుర్స్.. ట్విట్టర్ రివ్యూ
X

దాదాపు మూడేళ్ల విరామం తరువాత వకీల్ సాబ్ అంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇచ్చారు. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ పింక్‌ను రీమేక్ చేసి తెలుగులో చేశారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా నిన్న గురువారం రాత్రి ఓవర్సీస్‌లో విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. ఆక్కడి తెలుగు ప్రేక్షకులు సినిమాపై తమ అభిప్రాయాలను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.

పొలిటికల్ ఎంట్రీ తరువాత వచ్చిన సినిమాకావడంతో పాటు బ్లాక్ బస్టర్ మూవీ రీమేక్ కావడం పవన్ సినిమాపై అంచనాలను పెంచాయి. అమితాబ్ పోషించిన లాయర్ పాత్రను పవన్ పోషిస్తుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు ఫ్యాన్స్. అందుకు తగ్గట్టుగా భారీ స్థాయిలో ప్రమోషన్లు చేశారు. అత్యధిక లొకేష్లలో సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.

సినిమా చూసిన ప్రేక్షకులు పవన్ యాక్షన్, స్కీన్ ప్రెజెన్స్ అదిరిపోతోందని అంటున్నారు. కోర్టు సీన్లలో పవన్ యాక్షన్ సూపర్‌గా ఉందని అంటున్నారు. వేణు శ్రీరామ్ కథను అద్భుతంగా మలిచారని వినిపిస్తోంది.

తమన్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రాణం పోసిందని చెబుతున్నారు. పవన్ కళ్యాణ్-శృతిహాసన్‌ల మధ్య సీన్స్ కూడా బాగున్నాయని తెలిసింది. ఇక ప్రకాష్ రాజ్, నివేదా థామస్, అంజలి, అనన్య వారి వారి పాత్రలకు న్యాయం చేసారని టాక్. తమ అభిమాన హీరో పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ అద్భుతంగా ఉందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు.

పవన్ ఈ సినిమాను ఓన్ చేసుకుని నటించారని, ఇది పవన్ కెరీర్‌లోనే బెస్ట్ సినిమా అని అంటున్నారు. మొత్తానికి వకీల్ సాబ్ పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం ఆనందంగా ఉందని పవన్ ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు.

Next Story

RELATED STORIES