Varun Tej And Sai Pallavi : మరోసారి తెరపైకి 'ఫిదా' కాంబినేషన్..

Varun Tej And Sai Pallavi : మరోసారి తెరపైకి ఫిదా కాంబినేషన్..
Varun Tej And Sai Pallavi : వరుణ్ తేజ్, సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఫిదా చిత్రం ఎంత పెద్ద విజయాన్ని అందుకున్న అందరికీ తెలిసిందే..!

Varun Tej And Sai Pallavi : వరుణ్ తేజ్, సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఫిదా చిత్రం ఎంత పెద్ద విజయాన్ని అందుకున్న అందరికీ తెలిసిందే... ఈ సినిమాలో వరుణ్ తేజ్, సాయి పల్లవి కెమిస్ట్రీ ప్రేక్షకులకు బాగా నచ్చింది. అయితే ఈ జంటను మరోసారి స్క్రీన్ పైన కనిపించనుందని తెలుస్తోంది. ప్రస్తుతం వరుణ్ తేజ్ గని, ఎఫ్3 సినిమాలతో బిజీగా ఉన్నాడు. అటు సాయి పల్లవి.. విరాటపర్వం, శ్యామ్ సింగరాయ సినిమాలతో బిజీగా ఉంది. ఈ సినిమాలు పూర్తయిన తర్వాత.. వీరిద్దరూ కలిసి వెంకీ కుడుముల దర్శకత్వంలో నటించనున్నారని సమాచారం. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ కూడా పూర్తయిందని త్వరలో సినిమాని సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తోంది. మరియు యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ సినిమాని నిర్మించనున్నట్లు సమాచారం. దీనిపైన త్వరలోనే అధికార ప్రకటన రానుంది.

Tags

Read MoreRead Less
Next Story