రౌడీ స్టార్ రేర్ రికార్డ్, మూడోసారి మోస్ట్ డిజైరబుల్ మేన్ గా విజయ్ దేవరకొండ

యంగ్ స్టార్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ రేర్ రికార్డ్ సొంతం చేసుకున్నారు. "హైదరాబాద్ మోస్ట్ డిజైరబుల్ మెన్" గా మూడో సారి ఎంపికయ్యారు.

రౌడీ స్టార్ రేర్ రికార్డ్, మూడోసారి మోస్ట్ డిజైరబుల్ మేన్ గా విజయ్ దేవరకొండ
X

యంగ్ స్టార్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ రేర్ రికార్డ్ సొంతం చేసుకున్నారు. "హైదరాబాద్ మోస్ట్ డిజైరబుల్ మెన్" గా మూడో సారి ఎంపికయ్యారు. ఇది మరే టాలీవుడ్ స్టార్ కు దక్కని అరుదైన రికార్డ్. టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ ఏటా మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్ట్ రిలీజ్ చేస్తుంది. స్టార్ డమ్, టాలెంట్, ఆడియెన్స్ లో క్రేజ్ ఆధారంగా ఈ జాబితా తయారు చేస్తుంది.

తాజాగా రిలీజ్ చేసిన "హైదరాబాద్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2020" లిస్ట్ లో టాప్ ప్లేస్ దక్కించుకున్నారు విజయ్ దేవరకొండ. సెల్ఫ్ మేడ్ హీరోగా తనకు తానుగా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎదిగిన విజయ్ ...'పెళ్లి చూపులు', 'అర్జున్ రెడ్డి', 'టాక్సీవాలా', 'గీత గోవిందం'..ఇలా వరుస సూపర్ హిట్స్ తో స్టార్ హీరోగా టాలీవుడ్ లో సుస్థిర స్థానం ఏర్పర్చుకున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 'లైగర్' మూవీలో నటిస్తున్నారు. ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న 'లైగర్' విజయ్ బాక్సాఫీస్ స్టామినాను, స్టార్ డమ్ ను మరింత పెంచడం ఖాయంగా కనిపిస్తోంది.

Next Story

RELATED STORIES