Vijayashanti : అలాంటి సినిమానే చేస్తా.. అదే చివరిది : విజయశాంతి

Vijayashanti : అలాంటి సినిమానే చేస్తా.. అదే చివరిది : విజయశాంతి
Vijayashanti : విజయశాంతి.. ఇండస్ట్రీలో టాప్ హీరోలతో సరిసమానంగా క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్.. లేడీ అమితాబ్ అనే బిరుదు ఆమె సొంతం.

Vijayashanti : విజయశాంతి.. ఇండస్ట్రీలో టాప్ హీరోలతో సరిసమానంగా క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్.. లేడీ అమితాబ్ అనే బిరుదు ఆమె సొంతం. 30 సంవత్సరాల సినీ ప్రస్థానంలో వివిధ భాషాలలో దాదాపుగా 180 సినిమాలలో నటించి, మెప్పించి అశేషమైన ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు ఆమె.

సినిమాల తర్వాత రాజకీయాల్లోకి వెళ్ళిన ఆమె అందులోనే బిజీ అయిపోయారు. మళ్ళీ 13 సంవత్సరాల తర్వాత మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రంతో రీఎంట్రీ ఇచ్చారు. ఇందులో భారతి అనే పవర్ఫుల్ పాత్రలో నటించారు. ఆ పాత్ర ఆమెకి మంచి పేరును తీసుకొచ్చింది. దీనితో ఆమె వరుస సినిమాలు చేస్తారని అనుకున్నారు అంతా..

కానీ ఆమె సినిమాలకి దూరంగా ఉంటున్నారు. తాజాగా ఓ యుట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె.. మళ్ళీ ఫ్యూచర్ లో నటిస్తే పాత విజయశాంతి లాగా ఒకే ఒక్క యాక్షన్ ఫిలిం చేయాలనీ ఉందని, రొటీన్ సినిమాలు చేయడం ఇష్టం లేదని చెప్పుకొచ్చారు. మంచి యాక్షన్ కథతో ముందుకు వస్తే సినిమా చేస్తే రెడీ అని తెలిపారు. మరి చూడాలి మళ్ళీ విజయశాంతి నుంచి ఎప్పుడు సినిమా వస్తుందో..!

Tags

Read MoreRead Less
Next Story