Vishal: నటితో పెళ్లి క్యాన్సిల్ తర్వాత మరో యువతితో విశాల్ ప్రేమాయణం..

Vishal: నటితో పెళ్లి క్యాన్సిల్ తర్వాత మరో యువతితో విశాల్ ప్రేమాయణం..
Vishal: టాలీవుడ్‌లోనే కాదు కోలీవుడ్‌లో కూడా యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు విశాల్.

Vishal: సినీ పరిశ్రమలో పెళ్లి చేసుకున్న తర్వాత విడాకులు తీసుకున్న వారి సంఖ్య మాత్రమే కాదు.. ఎంగేజ్‌మెంట్ తర్వాత పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న వారి సంఖ్య కూడా ఎక్కువే. హీరోయిన్లలో మాత్రమే కాదు.. హీరోలలో కూడా అలా చేసినవారు ఉన్నారు. అందులో ఒకరు నటుడు విశాల్. ఇప్పటికే ఓ నటితో పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న విశాల్.. ఇప్పుడు మరోసారి ప్రేమలో ఉన్న విషయాన్ని బయటపెట్టాడు.

టాలీవుడ్‌లోనే కాదు కోలీవుడ్‌లో కూడా యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు విశాల్. యాక్షన్ సీన్స్‌లో డూప్ లేకుండా స్టంట్స్ చేస్తూ రిస్క్‌లు తీసుకోవడమేంటి విశాల్‌కు చాలా ఇష్టం. దానివల్లే ఎన్నోసార్లు తాను గాయాలపాలయ్యాడు కూడా. ఇటీవల తాను నటిస్తు్న్న 'లాఠీ' సినిమా షూటింగ్‌లో కూడా మరోసారి గాయపడ్డాడు విశాల్.

తాజాగా తనకు పెద్దలు కుదిర్చిన సంబంధాలు సెట్ అవ్వవని, తాను కచ్చితంగా లవ్ మ్యరేజే చేసుకుంటానని తేల్చిచెప్పేశాడు విశాల్. అంతే కాకుండా ప్రస్తుతం తాను ఓ అమ్మాయితో ప్రేమలో ఉన్నట్టు బయపెట్టాడు. కాకపోతే తాను ఎవరో ఇప్పుడే చెప్పనని, త్వరలో బయటపెడతానని ఆ అమ్మాయి గురించి సస్పెన్స్‌లో పెట్టాడు. ఇక విశాల్‌కు 2019లో నటి అనీషా అల్లారెడ్డితో నిశ్చితార్థం జరిగినా కూడా అది పెళ్లి వరకు వెళ్లలేదు.

Tags

Read MoreRead Less
Next Story