Vishnu Manchu : 'మా' పోటీలో మంచు విష్ణు విజయావకాశాలు ఎంత?

Vishnu Manchu : మా పోటీలో మంచు విష్ణు విజయావకాశాలు  ఎంత?
Vishnu Manchu : ఎప్పుడు లేని విధంగా ఈ సారి మా మూవీ అసోసియేషన్ ఎన్నికలు ఆసక్తిని సంతరించుకున్నాయి.

Vishnu Manchu : ఎప్పుడు లేని విధంగా ఈ సారి మా మూవీ అసోసియేషన్ ఎన్నికలు ఆసక్తిని సంతరించుకున్నాయి. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, యంగ్ హీరో విష్ణు, జీవితా రాజశేఖర్, హేమ లాంటి హేమాహేమీలు బరిలో ఉండడం ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు.

అయితే ఇప్పటివరకు తన సినిమాల విషయంలో తప్ప ఇండస్ట్రీలోని అంశాలపైన పెద్దగా ఫోకస్ చేయని హీరో విష్ణు.. ఇప్పుడు 'మా' అధ్యక్ష పదవికి పోటీ పడడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసిందని చెప్పాలి.

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనయుడిగా హీరోగా 2003లో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు విష్ణు.. విజయాలు, అపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. తాజాగా మోసగాళ్ళు అనే భారీ బడ్జెట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

ఇండస్ట్రీలో తన సినిమాలేంటో, తన పనేంటో తానూ చేసుకుంటూ వెళ్తున్న విష్ణుకి సౌమ్యుడిగా మంచి పేరుంది. అలాంటి విష్ణు ఇప్పుడు ఇండస్ట్రీలో, 'మా'లో అనుభవజ్ఞులైన ప్రకాష్ రాజ్, జీవితా రాజశేఖర్, హేమ లాంటి దిగ్గజాలతో పోటీ పడుతున్నాడు. వీరి నుంచి పోటీని తట్టుకొని ఏ మాత్రం నిలబడగలుగుతాడన్నది చూడాలి మరి.

అటు 'మా' అధ్యక్ష పదవికి ఇప్పటివరకు సీనియర్ నటులు, నటీమణులు మాత్రమే పోటీ పడ్డారు. ఇప్పుడు ఓ యంగ్ హీరో పోటీలో నిలబడడం మరో ఆసక్తికరమైన అంశంగా చెప్పుకోవచ్చు. ఈ యంగ్ హీరో అధ్యక్షతన మా అభివృద్ధికి నోచుకుంటుందని ఇండస్ట్రీలొని పలువురు భావిస్తున్నారు.

ఇండస్ట్రీలో చిరంజీవి, మోహన్ బాబు కుటుంబాల మధ్య మంచి సానిహిత్యం ఉంది. అయితే చిరంజీవి తమ్ముడు నాగబాబు మాత్రం ప్రకాష్ రాజ్ కి సపోర్ట్ గా నిలిచాడు. ఈ క్రమంలో చిరంజీవి స్టాండ్ ఎటు వైపు అన్నది కూడా ఆసక్తిని రేకెత్తిస్తుంది.

Tags

Read MoreRead Less
Next Story