జబర్దస్త్‌‌లో ఈ పవిత్ర ఎవరు.. ఆమె బ్యాక్‌‌గ్రౌండ్ ఏంటి?

జబర్దస్త్.. ఈ షో ద్వారా టాలెంట్ ఉన్న చాలా మంది కమెడియన్లు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు.

జబర్దస్త్‌‌లో ఈ పవిత్ర ఎవరు.. ఆమె బ్యాక్‌‌గ్రౌండ్ ఏంటి?
X

జబర్దస్త్.. ఈ షో ద్వారా టాలెంట్ ఉన్న చాలా మంది కమెడియన్లు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. అలా మెల్లిమెల్లిగా సినిమా అవకాశాలు కూడా దక్కించుకుంటున్నారు.


అయితే ముందుగా ఈ షోలో లేడీ కమెడియన్లు ఉండేవారు కాదు.. మొగవాళ్ళే లేడీ గెటప్‌‌లు వేసేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. లేడీ కమెడియన్లు కుడా మొగవాళ్ళకి ధీటుగా స్కిట్లు చేస్తున్నారు.


చమ్మక్‌‌చంద్ర ఉన్నప్పుడు ఆయన టీమ్‌లో సత్య అనే అమ్మాయి ఉండేది. వరుసుగా చంద్రతో స్కిట్లు చేసి మంచి ఫేం సంపాదించుకుంది. ఇక ఆ తర్వాత రోహిణి, ఫాతిమా, వర్షలు వచ్చి క్లిక్ అయ్యారు.


ఇప్పుడు అదే రూట్‌‌లో వచ్చి మంచి ఫేం సంపాదించుకుంది పవిత్ర. ఈ మధ్య ఈ లేడీ కమెడియన్ ప్రతి ఎపిసోడ్‌‌లో కనిపిస్తుంది. మంచి పెర్ఫార్మెన్స్‌‌తో బాగానే ఆకట్టుకుంటుంది.


భాస్కర్, వెంకీ మంకీస్, హైపర్ ఆది.. ఇలా ప్రతీ టీమ్‌లోనూ కామన్‌గా కనిపిస్తూ తన హైట్ పైన పంచులు వేయించుకుంటూ తెగ నవ్విస్తుంది.


అయితే ఈమె టిక్‌‌టాక్ నుంచి ఫేమస్ అయినట్టుగా తెలుస్తోంది. జబర్దస్త్ లో నటిస్తూనే షార్ట్ ఫిలిమ్స్ ద్వారా కూడా మెప్పిస్తుంది.

Next Story

RELATED STORIES