విజయలక్ష్మి సిల్క్ స్మితగా ఎలా మారింది..

విజయలక్ష్మి సిల్క్ స్మితగా ఎలా మారింది..
ఓ నటికి మేకప్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ని మొదలు పెట్టి ఆమె ఇండస్ట్రీలోకి ప్రవేశించింది. ఆ విధంగా ఆమె సినిమాల్లో సహాయక

విజయలక్ష్మి వడ్లపట్ల సినిమాల్లోకి వచ్చి సిల్క్ స్మితగా మారిపోయింది. 1980 లలో దక్షిణ భారత సినిమాల్లో సెక్స్ సింబల్‌గా పిలిపించుకుంది సినీ ప్రేక్షకులచేత. 36 సంవత్సరాల వయస్సులోనే సిల్క్ స్మిత స్టార్‌డమ్‌ను ఆస్వాదించింది. అయినప్పటికీ నిజ జీవితంలో సంతృప్తిగా లేదు. అదే ఆమె తన ప్రాణాలను తీసుకునేందుకు పురిగొల్పింది. డిసెంబర్ 2 సిల్క్ స్మిత 60 వ జయంతి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆమె కీర్తి ప్రతిష్టలను, ఆమె ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులను విశ్లేషిద్దాం.

విజయాలక్ష్మి సిల్త్ స్మిత్ ఎలా అయ్యారు?

విజయలక్ష్మి ఆంధ్రప్రదేశ్ లోని ఒక పేద తెలుగు కుటుంబంలో జన్మించారు. ఆమె ఆర్థిక నేపథ్యం కారణంగా ఎనిమిదేళ్ల వయసులోనే తన చదువును నిలిపివేయాల్సి వచ్చింది. కుటుంబ సభ్యులు ఆమెకు చిన్న వయసులోనే వివాహం చేశారు. భర్త, అత్తమామల వేధింపుల నుంచి తప్పించుకునేందుకు మద్రాస్ రైలెక్కింది.

చెన్నైలో కొత్త జీవితాన్ని ప్రారంభించింది. ఓ నటికి మేకప్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ని మొదలు పెట్టి ఆమె ఇండస్ట్రీలోకి ప్రవేశించింది. ఆ విధంగా ఆమె సినిమాల్లో సహాయక పాత్రలు పోషించి అవకాశాన్ని తెచ్చుకుంది.

దర్శకుడు విను చక్రవర్తి ఆమెను గమనించి ఆమెను స్మితగా పరిచయం చేశాడు. 1979 లో, ఆమె వండిచక్కరం అనే విజయవంతమైన చిత్రంలో భాగమైంది. ఇందులో ఆమె సిల్క్ పాత్రను పోషించింది. ఆమె పాత్రకు ప్రశంసలు దక్కడంతో తరువాత, ఆమె తన పేరుకు సిల్క్‌ను జోడించి సిల్క్ స్మితగా మారింది.

సిల్క్ స్మిత్ ఎలా స్టార్‌డమ్‌లో ఉన్నారు?

ఆమె అద్భుతమైన లుక్స్ మరియు సెక్స్ అప్పీల్ ఆమెను సినిమాల్లో ప్రత్యేక నటీమణులలో ఒకరిగా చేసింది. సిల్క్ స్మిత తన ప్రత్యేక నృత్య భంగిమల ద్వారా పలు విజయవంతమైన చిత్రాలలో భాగం పంచుకుంది.

80, 90 లలో సిల్క్ స్మిత కోసం దర్శకులు ప్రత్యేకంగా పాటలు రాయించేవారు.. ఈ పాటలు తరచూ సూపర్ హిట్ అయ్యేవి కానీ ఒక వర్గం ప్రేక్షకులు ఆ పాటల్ని, ఆమె డాన్సులను తప్పుపట్టేవారు. ఆమె సినిమాల్లో శృంగార పాత్రలు పోషించటానికి మాత్రమే పరిమితమైందనే పేరు పడిపోయింది.

సిల్క్ స్మిత తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ చిత్ర పరిశ్రమలలో ఏక కాలంలో పనిచేసింది. సకలకలవల్లవన్, మూండ్రామ్ పిరై, పాయూమ్ పులి, తంగా మగన్ సిల్క్ స్మితను మార్చిన చిత్రాలు.

ఆమెను సినిమా రంగంలోకి తీసుకువచ్చిన విలు చక్రవర్తి, అతని భార్య సిల్క్ స్మితను చూసుకున్నారు. వారు ఆమెకు ఇంగ్లీష్ భాష నేర్పించడంతో పాటు డ్యాన్స్ క్లాసులకు పంపించేవారు. అవి ఆమెలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుకునేందుకు దోహదపడ్డాయి. దాంతో సినిమాల్లో కొన్ని సవాలు పాత్రలను కూడా తీసుకుంది. అలియాగల్ ఓవతిల్లైలో ఆమె ఒక అవినీతి మనిషి భార్య పాత్రను పోషించింది.

"సిల్క్ స్మిత పూర్తి ప్రొఫెషనల్" అని ఆమెతో కలిసి పనిచేసిన పలువురు చిత్రనిర్మాతలు చెబుతారు.

సిల్క్ స్మిత తన కెరిర్‌లో లెక్కకు మించి పాత్రలు చేసినా కానీ, ఆమె వ్యక్తిగత జీవితం ఆమెను నిరాశలోకి నెట్టింది. ఆమె ఒంటరిగా బాధపడేది. ఆమె ఎవరితోనూ ఎక్కువ చనువుగా ఉండేది కాదు. అంతర్ముఖురాలు కాబట్టి, కష్ట సమయాల్లో ఆమెకు మద్దతు ఇవ్వడానికి స్నేహితులు లేరు.

ఆమెను వ్యక్తిగతగా ఇబ్బందికి గురిచేసిన అంశాలు చాలానే ఉన్నాయి. వాటన్నింటిని భరించే శక్తి ఇక తనకి లేదని నిర్ణయించుకుంది. సెప్టెంబర్ 23, 1996 న, ఆమె తన జీవితాన్ని ముగించాలని నిర్ణయించుకుంది.

సిల్క్ స్మిత తన బెస్ట్ ఫ్రెండ్ అనురాధను రమ్మని ఫోన్ చేసింది. అనురాధ కొరియోగ్రాఫర్, నటి కూడా. అయితే తాను వేరే పనేదో ఉండడం వలన రాలేకపోతున్నానని మరుసటి రోజు ఆమెను కలుస్తానని అనురాధ వాగ్దానం చేయగా, సిల్క్ స్మిత సెప్టెంబర్ 23 న ఉరి వేసుకుని తన జీవితాన్ని ముగించింది. సినీ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.

సిల్క్ స్మితను గుర్తుచేసుకుంటూ, ఆమెతో కలిసి పనిచేసిన చాలా మంది దర్శకులు ఆమె వృత్తి నైపుణ్యాన్ని, ఆమెలోని చిన్న పిల్లల మనస్తత్వాన్ని మెచ్చుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story