మహేష్ తో చేద్దామంటే తరుణ్ చాలు అన్నాను ; కాశీ విశ్వనాధ్

తరుణ్, ఆర్తీ అగర్వాల్ హీరోహీరోయిన్లుగా కాశీ విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నువ్వు లేక నేను లేను'.. సురేష్ ప్రొడక్షన్ పై డాక్టర్ డి రామానాయుడు ఈ సినిమాని నిర్మించారు.

మహేష్ తో చేద్దామంటే తరుణ్ చాలు అన్నాను ; కాశీ విశ్వనాధ్
X

తరుణ్, ఆర్తీ అగర్వాల్ హీరోహీరోయిన్లుగా కాశీ విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'నువ్వు లేక నేను లేను'.. సురేష్ ప్రొడక్షన్ పై డాక్టర్ డి రామానాయుడు ఈ సినిమాని నిర్మించారు. 2002లో విడుద‌లైన‌ ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. అప్పటివరకు రచయితగా ఉన్న కాశీ విశ్వనాథ్ కి ఈ సినిమాతోనే దర్శకుడిగా మంచి పేరును సంపాదించుకున్నారు.

అయితే ముందుగా ఈ కథను మహేష్ బాబుతో చేద్దామని సురేష్ బాబు భావించారట. దానికి కాశీ విశ్వనాథ్ స్పందిస్తూ.. మహేష్ బాబుతో సినిమా అంటే నాలుగు సంవత్సరాలు టైం పడుతుంది. మహేష్ తో చేసేందుకు చాలా మంది క్యూలో ఉంటారు. తరుణ్ అయితే ఈ కథకి సరిగ్గా సరిపోతాడని, అప్పుడే నువ్వే కావాలి మంచి హిట్ అయిందని సురేష్ బాబుతో చెప్పాడట.. దీనితో రోజారమణి దగ్గరికి వెళ్లి కథ చెప్పి.. అడ్వాన్సు కూడా ఇప్పించారట కాశీ విశ్వనాధ్.

ఇక సినిమాలో రామచంద్రయ్య పాత్రని రంగనాథ్ తో చేయిద్దామని సురేష్ బాబు అంటే.. ఆ పాత్రికి దర్శకుడు విశ్వనాధ్ అయితే సరిగ్గా సరిపోతారని పట్టుబట్టి ఆయన్నే తీసుకున్నారట కాశీ విశ్వనాధ్. ఓ ఇంట‌ర్వ్యూలో ఈ విషయాన్నీ తెలియ‌జేశారు కాశీ విశ్వనాధ్.Next Story

RELATED STORIES