రిలీజ్ డేట్ తో ట్రెండ్ సెట్ చేసిన KGF 2

అలా అభిమానుల్లో రిలీజ్ డేట్ ఎప్పుడు వస్తుందా అని ఓ సస్పెన్స్ గా మైంటైన్ చేసుకుంటూ వస్తున్న సినిమా KGF చాప్టర్ 2.

రిలీజ్ డేట్ తో ట్రెండ్ సెట్ చేసిన KGF 2
X

ఒక్కప్పుడు ఓ సినిమా విడుదలైందంటే ఎన్నో సెంటర్ లలో ఎన్నో రోజులు ఆడింది అనేది లెక్క ఉండేది. దీనితోనే సినిమా సక్సెసా, ఫెయిలా అనేది చెప్పేవారు. దీనికి తోడు 50 డెస్, 100డెస్ ఫంక్షన్లు ఉండేవి. బాక్స్ ఆఫీస్ లెక్కలు ఆఫీషియల్ గా బయటకు వచ్చేవి కాదు కూడా.. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఇప్పుడు రోజులు కన్నా బాక్స్ ఆఫీస్ లెక్కలే సినిమా హిట్టా? ఫట్టా? అనేది డిసైడ్ చేసేస్తున్నాయి.

ఒకప్పటీలాగా ఇప్పుడు 50, 100, 175 డెస్ ఫంక్షన్లు లేవు. సినిమాకి సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లతోనే సగం బిజినెస్ అవుతుంటే ప్రీ రిలీజ్ ఫంక్షన్ లతో డబల్ బిజినెస్ అవుతుంది. వీటికి తోడు ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ లు సినిమాకి ఎక్కడలేని క్రేజ్ తెచ్చిపెడుతున్నాయి. దీనితో తమ అభిమాన హీరో సినిమా రిలీజ్ డేట్ కోసం ప్రేక్షకులను ఎదురుచూసేలా చేస్తున్నాయి.

అలా అభిమానుల్లో రిలీజ్ డేట్ ఎప్పుడు వస్తుందా అని ఓ సస్పెన్స్ గా మైంటైన్ చేసుకుంటూ వస్తున్న సినిమా KGF చాప్టర్ 2.. ఫస్ట్ పార్ట్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ సినిమాకి ఇప్పుడు సీక్వెల్ వస్తోంది. ఇప్పటికే ఫస్ట్ లుక్, టీజర్ లు రిలీజ్ అవ్వడంతో సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనితో సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడొస్తుందా అని యావత్ సినీ లోకాన్ని టీవీలకి అత్తుకోపోయేలా చేసి ఓ ట్రెండ్ క్రియేట్ చేసింది ఈ సినిమా.

అయితే కొద్దిసేపటి క్రితమే జూలై 16న ప్రపంచవ్యాప్తంగా KGF చాప్టర్ 2ను రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. సింహం ముందు మిషన్ గన్‌తో నిల్చున్న యశ్ పోస్టర్ తో రిలీజ్ డేట్ ను ప్రకటించారు. తెలుగు, కన్నడ, తమిళ్, మళయాళం, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానున్న ఈ సినిమాకి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు.

Next Story

RELATED STORIES