చిన్నప్పటి మహేంద్ర బాహుబలి ఇప్పుడెలా ఉందో చూడండి!

బాహుబలి- ది బిగినింగ్‌లో రమ్యకృష్ణ (శివ‌గామి) త‌న చేతిలో ఓ చిన్నారిని నీటిలో మున‌గ‌కుండా పైకి లేపి “మహేంద్ర బాహుబలి బ్రతకాలి ” అంటూ తుది శ్వాస విడిచిన సన్నివేశం అందరికి గుర్తుండే ఉంటుంది.

చిన్నప్పటి మహేంద్ర బాహుబలి ఇప్పుడెలా ఉందో చూడండి!
X

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి చిత్రం ఎంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే! . ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ సినిమా రెండు భాగాలుగా వచ్చి తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని నలువైపులా విస్తరింపజేసింది.

ఈ సినిమాలో నటించిన ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, సత్యరాజ్, రమ్యకృష్ణ లకి ఎక్కడలేని క్రేజ్ ఏర్పడింది. అయితే బాహుబలి- ది బిగినింగ్‌లో రమ్యకృష్ణ (శివ‌గామి) త‌న చేతిలో ఓ చిన్నారిని నీటిలో మున‌గ‌కుండా పైకి లేపి "మహేంద్ర బాహుబలి బ్రతకాలి " అంటూ తుది శ్వాస విడిచిన సన్నివేశం అందరికి గుర్తుండే ఉంటుంది.

దీనినే మందుగా ఫస్ట్ లుక్ గా రిలీజ్ చేస్తే వీపరితంగా క్రేజ్ వచ్చింది. అయితే ఆ చిన్నారిని చిన్నప్పటి ప్రభాస్‌గా మ‌న‌కు చూపించాడు రాజమౌళి.. అయితే ఆ పాత్ర పోషించింది తన్వి అనే అమ్మాయి. సినిమా చేస్తున్న సమయంలో నెల‌ల పిల్లగా ఉన్న తన్వీ... ఇప్పుడు చాలా పెద్దదై స్కూల్ కి వెళ్తుంది.

ప్రస్తుతం కొందరు తన్వితో దిగిన ఫోటోలను ట్విటర్‌లో పోస్టు చేయడంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Next Story

RELATED STORIES