2014లోనే ప్రభాస్, సోనాక్షి సిన్హాతో కలిసి..

పెళ్లి ప్రపోజల్స్ పంపినా మిస్టర్ కూల్ చిరునవ్వే సమాధానంగా

2014లోనే ప్రభాస్, సోనాక్షి సిన్హాతో కలిసి..
X

తెలుగు ప్రేక్షకులు ముద్దుగా పిలుచుకునే డార్లింగ్ ప్రభాస్ అమ్మాయిల కలల రాకుమారుడు.. ఆరడుగల అందగాడు.. ఆజాను బాహుడు.. ఒక్క సినిమాకోసం అయిదేళ్లు కేటాయించిన సాహసికుడు. నటించిన ప్రతి సినిమాలో తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు.. బాహుబలిగా తెలుగువారి గుండెల్లోనే ప్రపంచ ప్రజల అభిమానాన్నీ చూరగొన్నాడు. బాహుబలిలో అతడి నటనను చూసిన అమ్మాయిలు వందల సంఖ్యలో పెళ్లి ప్రపోజల్స్ పంపినా మిస్టర్ కూల్ చిరునవ్వే సమాధానంగా చెప్పాడు. ఈ రోజు మిస్టర్ ఫర్‌ఫెక్ట్ పుట్టినరోజు. మద్రాస్‌లో జన్మించిన ప్రభాస్‌కి ముద్దు పేర్లు చాలానే ఉన్నాయి. డార్లింగ్, ప్రభ, పబ్సీ. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో పుట్టిన ఈ మొనగాడు హైదరాబాద్ శ్రీచైతన్య కాలేజీలో ఇంటర్ చదివి ఆపై ఇంజనీరింగ్ కంప్లీట్ చేశారు.

చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసిన విషయం.. 2014లోనే ప్రభాస్ ఓ హిందీ సినిమాలో మెరిశారు. అజయ్ దేవగణ్, సోనాక్షి సిన్హా కలిసి నటించిన 'యాక్షన్ జాక్సన్‌'లో అతిధిగా కనిపించారు. నాన్న నిర్మాత, పెదనాన్న నటుడైనా తనకు నటుడవ్వాలన్న కోరిక అస్సలు లేదని ఓ సందర్భంలో చెప్పిన ప్రభాస్‌కి రెస్టారెంట్ నడపాలని ఆసక్తి ఉండేదట. పుస్తకాలు చదవడంపై ఆసక్తి చూపే అతడికి ఇంట్లో ఓ చిన్నపాటి లైబ్రరీనే ఏర్పాటు చేసుకున్నాడట. షూటింగ్స్ లేని సమయంలో పుస్తకమే తన ప్రపంచం.

బాహుబలితో ప్రపంచ వ్యాప్తంగా పేరు సంపాదించుకున్న ప్రభాస్ వాణిజ్య ప్రకటనలకు కాస్త దూరంగా ఉంటారు. 2015లో తొలిసారి ఓ కారు ప్రచారంలో భాగంగా వాణిజ్య ప్రకటనలో నటించారు. ఇండియన్ సినిమాను టాలీవుడ్ వైపు తిరిగి చూసేలా చేసిన చిత్రం బాహుబలి. 1700 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి తెలుగు సినిమా మార్కెట్ రేంజ్‌ని ఒక్కసారిగా పెంచేసింది. బాహుబలితో ప్రభాస్ స్టార్ డమ్ పెరగడంతో ఆయన నటించిన చిత్రాలను ఇతర భాషల్లో డబ్బింగ్ చేసి విడుదల చేస్తున్నారు.

బాలీవుడ్ డైరక్టర్‌తో ప్రభాస్ ఆదిపురుష్ చేస్తున్నారు. 7000 సంవత్సరాల క్రితం పుట్టిన తెలివైన రాక్షసుడిని సంహరించడానికి, చెడుపై మంచి సాధించింది అనడానికి ప్రతీకగా రామాయణాన్ని చెప్పుకుంటారు. ఇదే కాన్సెప్ట్‌తో ఆదిపురుష్‌ను తెరకెక్కించనున్నారు. ఈ చిత్రంలో రాముడి పాత్రలో ప్రభాస్ కనిపించనున్నారు. ప్రతి నాయకుడి పాత్రలో సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. బాలీవుడ్ నిర్మాతలు భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని హిందీ, తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం భాషల్లో నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రం పట్టాలెక్కనుంది.

Next Story

RELATED STORIES