ఓ వరుడు.. ఇద్దరు వధువులు.. ఒకే ముహూర్తానికి పెళ్లి!

ఓ యువకుడు ఇద్దరు యువతులను ఒకే ముహూర్తానికి పెళ్లి చేసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని తిక్రాలొహంగా అనే గ్రామంలో చోటు చేసుకుంది.

ఓ వరుడు.. ఇద్దరు వధువులు.. ఒకే ముహూర్తానికి పెళ్లి!
X

ఓ యువకుడు ఇద్దరు యువతులను ఒకే ముహూర్తానికి పెళ్లి చేసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని తిక్రాలొహంగా అనే గ్రామంలో చోటు చేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. చందు మౌర్య అనే వ్యక్తి హసీనా బాగెల్ (19), (సుందరి) 21 అనే ఇద్దరమ్మాయిలను ప్రేమించాడు. గిరిజన అమ్మాయి సుందరి కశ్యప్‌తో ముందుగా ప్రేమలో పడిన చందు మౌర్య.. ఆ తర్వాత బంధువుల వివాహం వద్ద కలుసుకున్న హసీనాతో రెండో సారి ప్రేమలో పడ్డాడు. పెళ్లి విషయం వచ్చేసరికి ఎవరిని వదులుకోవాలో తేల్చుకోలేకపోయాడు.

దీనితో ఇరు కుటుంబాల పెద్దలతో మాట్లాడి.. జనవరి 5 న ఒకే కళ్యాణ మండపంలో, ఒకే ముహూర్తానికి ఇద్దరి మేడలో తాళి కట్టి ఏడూ అడుగులు వేశాడు. ఇక ఈ పెళ్ళికి ఆ గ్రామంలోని పెద్దలందరూ కూడా అంగీకారం తెలిపారు. అయితే ఒకే మండపం పైన ఓ యువకుడు ఇద్దరు యువతులను వివాహం చేసుకోవడం ఛత్తీస్‌గఢ్‌ లో మొదటిసారి అని తెలుస్తోంది. ఇక ఈ రెండో వివాహం తమ ఆచారమని, ఇదేమి పెద్ద వింతేమి కాదని అక్కడి గిరిజనులు అనడం గమనార్హం.. ఈ పెళ్ళికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Next Story

RELATED STORIES