వామ్మో... సులభ్ కాంప్లెక్స్‌లో మటన్ దుకాణం!

వామ్మో... సులభ్ కాంప్లెక్స్‌లో మటన్ దుకాణం!
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగర పరిధి మున్సిపాలిటీలో సులభ్ కాంప్లెక్స్ ను నిర్వహించమని ఓ వ్యక్తికి పని అప్పజెప్పితే.. అతను అందులోనే మటన్ షాప్ పెట్టాడు.

మనకి మటన్ కావాలంటే ఏంచేస్తాం.. బయటకు వెళ్లి మటన్ షాపుకి వెళ్లి తెచ్చుకుంటాం... చికెన్, ఎగ్స్ కావాలంటే చికెన్ షాపుకి వెళ్లి తెచ్చుకుంటాం.. కానీ ఓ ప్రాంతంలో మాత్రం మటన్, గుడ్ల కోసం సులభ్ కాంప్లెక్స్ వద్దకు వెళ్తున్నారు. అదేంటని ఆశ్చర్యపోతున్నారా? అవును.. ఈ వింత సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

ఇక వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగర పరిధి మున్సిపాలిటీలో సులభ్ కాంప్లెక్స్ ను నిర్వహించమని ఓ వ్యక్తికి పని అప్పజెప్పితే.. అతను అందులోనే మటన్ షాప్ పెట్టాడు. అందులో మటన్, గుడ్లు అమ్ముతున్నాడు. ఓ వైపు సులభ్ కాంప్లెక్స్ నిర్వహణకు వచ్చే జీతంతోపాటు, సొంత వ్యాపారాన్ని కూడా నడిపించాడు. ఇలా కొన్ని రోజులు బాగానే నడిచింది.

అయితే ఇటీవల తనిఖీలకు వచ్చిన పురపాలక అధికారులు ఈ తతంగాన్ని చూసి షాక్ అయ్యారు. వెంటనే అతడికి రూ.1000 జరిమానా విధించారు. అలాగే సులభ్ కాంప్లెక్స్‌లను నిర్వహించే NGO 'సులభ్ ఇంటర్నేషనల్‌'కు రూ.20వేలు ఫైన్ వేశారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ప్రజల ఆరోగ్యంతో ఆడుకున్న ఆ వ్యక్తికి శిక్ష విధించాలని నెటిజన్లు పేర్కొంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story