హ్యాట్సాఫ్: పెళ్లిని లెక్కచేయలేదు... ఓ చిన్నారికి ఊపిరి పోశారు..!

హ్యాట్సాఫ్: పెళ్లిని లెక్కచేయలేదు... ఓ చిన్నారికి ఊపిరి పోశారు..!
వారి పెళ్లి రోజు వారికి గుర్తుంటుందో లేదో కానీ.. వారి చేసిన పని మాత్రం.. ఓ చిన్నారి తల్లిదండ్రులకి మాత్రం జీవితాంతం గుర్తుంటుంది. ఇంతకీ వారు ఏం చేశారంటే.

వారి పెళ్లి రోజు వారికి గుర్తుంటుందో లేదో కానీ.. వారి చేసిన పని మాత్రం.. ఓ చిన్నారి తల్లిదండ్రులకి మాత్రం జీవితాంతం గుర్తుంటుంది. ఇంతకీ వారు ఏం చేశారంటే.. ఉత్తరప్రదేశ్‌కి చెందిన ఓ జంట పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లి వేడుకులు అయిపోయి.. ఇక గృహప్రవేశం చేయాల్సిన సమయం అది.. కానీ అ జంట మాత్రం నేరుగా ఆసుపత్రికి వెళ్ళింది.

అక్కడ సమయానికి రక్తం లభించక.. ప్రాణాల కోసం పోరాడుతున్న ఓ చిన్నారికి రక్తం అందించి ఊపిరి పోశారు. ఈ సందర్భంగా ఆ కొత్త జంటను నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన పోలీస్ అధికారి ఆశిష్ కుమార్ మిశ్రా ఈ విషయాన్నీ ట్వీట్ చేయడంతో ఈ న్యూస్ వైరల్ గా మారింది.

''నా దేశం ఎంతో గొప్పది. ఓ బాలికకు అత్యవసరంగా రక్తం అవసరమైంది. కానీ, ఎవరూ ముందుకు రాలేదు. ఎందుకంటే ఆమె వేరొకరి బిడ్డ. కానీ.. ఆ వధవరులు అలా భావించలేదు. రక్తదానం చేసి ఆ బాలిక ప్రాణాలు కాపాడారు'' అని ఆశిష్ కుమార్ మిశ్రా తన ట్వీట్ లో పేర్కొన్నారు.

కాగా ఈ ట్వీట్ లో వరుడు రక్తదానం చేస్తుంటే వధువు పక్కనే నిలుచుని ఉంది. ఈ న్యూస్ వైరల్ కావడంతో నెటిజన్లు వారిని అభినందిస్తూ హాట్సాఫ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


Tags

Read MoreRead Less
Next Story