ఫోటోగ్రాఫర్‌ ఓవరాక్షన్‌.. వరుడు రియాక్షన్.. చూసి నవ్వుకోండి!

శుభకార్యాలకి ఫోటోలు, వీడియోల అనేవి ఇప్పుడు తప్పనిసరి అయిపొయింది. ఆ శుభకార్యానికి సంబంధించిన జ్ఞాపకాలు పది కాలాల పాటు పదిలంగా ఉండాలని ఫోటోలు, వీడియోలకు చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు.

ఫోటోగ్రాఫర్‌ ఓవరాక్షన్‌.. వరుడు రియాక్షన్.. చూసి నవ్వుకోండి!
X

శుభకార్యాలకి ఫోటోలు, వీడియోల అనేవి ఇప్పుడు తప్పనిసరి అయిపొయింది. ఆ శుభకార్యానికి సంబంధించిన జ్ఞాపకాలు పది కాలాల పాటు పదిలంగా ఉండాలని ఫోటోలు, వీడియోలకు చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు కూడా తమ క్రియేటివిటీని ఉపయోగించి చాలా అందంగా చూపించేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

ఇక ఈ మ‌ధ్య‌కాలంలో ఫ్రీ వెడ్డింగ్ షూట్స్, పోస్టు వెడ్డింగ్స్ పేర్లతో వీటికి మరింత డిమాండ్ ఏర్పడిందనే చెప్పాలి. అయితే అలా ఫోటోలు, వీడియోలు తీస్తున్న క్రమంలో కొంద‌రు అతిగా కూడా ప్ర‌వ‌ర్తిస్తుంటారు. తాజాగా ఓ పెళ్లి వేడుక‌లో ఓ ఫోటో గ్రాఫ‌ర్ చేసిన పని ఇప్పుడు వీడియో సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తుంది.

ఇంతకీ ఈ వీడియోలో ఏం జరిగిందంటే.. ఓ పెళ్లి వేడుకలో భాగంగా వ‌ధువు, వ‌రుడు ఇద్దరు స్టేజ్‌పైన నిలుచుని ఉన్నారు. వారిని ఫోటోగ్రాఫ‌ర్ ఫోటోలు తీస్తున్నాడు. ఐతే అతను వరుడుని పక్కన పెట్టేసి కేవలం వ‌ధువుపైనే ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టాడు. అదే పనిగాఆమెనే ఫోటోలు తీస్తున్నాడు. ఇదంతా గమనిస్తున్న వరుడికి ఒళ్ళు మండింది.

దీనితో ఫోటోగ్రాఫ‌ర్ మెడ‌పై ఒక్క‌టి ఇచ్చి ఇక్కడినుంచి వెళ్లిపో అన్నట్టుగా వార్నింగ్ కూడా ఇచ్చాడు. దీంతో వెంటనే ఆ ఫొటోగ్రాఫర్ భయపడిపోయి క్షమాపణలు చెప్పాడు. అయితే వ‌రుడు చేసిన ప‌నికి వ‌ధువు కింద కూర్చుని పగలబడి నవ్వింది.


Next Story

RELATED STORIES