Humanity: మానవత్వం ఇంకా మిగిలే ఉంది.. ఈ ఘటనే ఉదాహరణ
Humanity: తాజాగా జరిగిన ఓ సంఘటన చిన్నపాప హృదయాన్ని కదిలించింది. మంచి మనసుతో ఆలోచించింది..

Humanity: ఎవరు ఎలా పోతే నాకేంటి.. నాకసలే టైమ్ లేదు.. అయినా వాళ్లు నాకేమవుతారు.. ఎందుకొచ్చిన గొడవ.. మళ్లీ పోలీసులతో ఒక తలనొప్పి.. ఇవన్నీ నాకవసరమా..!!.. ప్రతి రోజు రోడ్డు మీద జరిగే కొన్ని సంఘటనలకి దాదాపు ప్రతి ఒక్కరు ఇలాగే ఆలోచిస్తారు.. ఎందరో మహానుభావులు కొందరికే వందనాలు.. వందల్లో ఒక్కరుగా ఉండే మంచి మనుషులు కొందరు ఉంటారు.. వారి ఆలోచనలు అందరికంటే భిన్నంగా ఉంటాయి.
స్వలాభం కొంత మానుకుని పరుల కోసం పరితపిస్తారు.. కష్టంలో మేమున్నామంటూ ముందుకు వస్తారు.. తాజాగా జరిగిన ఓ సంఘటన చిన్నపాప హృదయాన్ని కదిలించింది. మంచి మనసుతో ఆలోచించింది.. కారులో వెళుతున్న ఆ చిన్నారికి రోడ్డు పక్కన టైరు పంక్చర్ అయిన ఆటో కనిపించింది. ఆటో డ్రైవర్ వచ్చి పోయే వాహనాలను ఆపే ప్రయత్నం చేస్తున్నాడు.. ఏ ఒక్కరైనా ఆదుకోపోతారా అని అనుకున్నాడు.. కానీ ఒక్కరు కూడా తమ వాహనాలకు బ్రేక్ వేయలేదు.. అందులో నిండు గర్భిణీ అయిన ఓ తల్లి పడుతున్న వేదన అర్థమైంది ఆ చిట్టి మనసుకి..
రయ్ మంటూ ముందుకు దూసుకుపోతున్న కారుని వెనక్కు తీసుకువెళ్లమని నాన్నతో చెప్పింది.. ఆటో పక్కన ఆపి ఆమెకు సహాయం అందించేందుకు కారులో నుంచి కిందికి దిగింది. పరుగున వెళ్లి ఆమెకు మంచి నీళ్లు అందించింది.. ఆపైన ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్లింది కారులో ఎక్కించుకుని.. దీంతో ఆటో డ్రైవర్ ఆ చిన్న పాపకు చేతులెత్తి నమస్కరించాడు.. నీలాంటి మంచి మనసు అందరికీ ఉండే ఎంత బావుండు అనుకున్నాడు మనసులో. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ ట్విట్టర్‌లో వైరల్ అవుతోంది.
No words 🥺❤️pic.twitter.com/PeIquRTmjS
— Saran Vjay | BEAST | MSD🔥 (@Saran_VjayJr) December 6, 2021
RELATED STORIES
Oscar Award: ఓటీటీలో విడుదలయ్యే సినిమాలకు షాక్.. ఆస్కార్ నిబంధన..
22 May 2022 11:12 AM GMTDhanush: ధనుష్ తమ కొడుకే అంటున్న దంపతులు.. చట్టపరంగా నోటీసులు పంపిన...
21 May 2022 3:55 PM GMTRakshit Shetty: నటితో రష్మిక ఎక్స్ బాయ్ఫ్రెండ్ పెళ్లి.. క్లారిటీ...
21 May 2022 1:41 PM GMTKamal Haasan: జాతీయ భాషా వివాదంపై స్పందించిన కమల్.. మాతృభాషకు...
17 May 2022 9:41 AM GMTPallavi Dey: 21 ఏళ్ల బుల్లితెర నటి అనుమానాస్పద మృతి.. స్నేహితుడిపై...
16 May 2022 9:51 AM GMTUdhayanidhi Stalin: 'అదే యాక్టర్గా నా చివరి చిత్రం'.. యంగ్ హీరో...
14 May 2022 8:30 AM GMT