Viral Video : సెల్ఫీ కోసం ట్రై .. ఓ ఆటాడుకున్న పొట్టేలు..!

Viral Video : సెల్ఫీ కోసం ట్రై .. ఓ ఆటాడుకున్న పొట్టేలు..!
ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఉంటుంది. మరికొందరి దగ్గరైతే రెండేసి ఫోన్ లు కూడా ఉంటున్నాయి. ఈ ఫోన్ లతో సెల్ఫీలు, వీడియోలు తీయడమనేది అందరికీ ఓ దినచర్యగా మారిపోయింది.

ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఉంటుంది. మరికొందరి దగ్గరైతే రెండేసి ఫోన్ లు కూడా ఉంటున్నాయి. ఈ ఫోన్ లతో సెల్ఫీలు, వీడియోలు తీయడమనేది అందరికీ ఓ దినచర్యగా మారిపోయింది. అయితే ఈ సెల్ఫీలు కొన్ని చోట్ల విషాదాన్ని నింపుతుండగా.. మరికొన్ని చోట్లల్లో మాత్రం వినోదాన్ని నింపుతున్నాయి. అందులో భాగంగానే ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలోని ఓ అమ్మాయి... కట్టేసిన పోట్టేలు దగ్గరకు వెళ్లి సెల్ఫీ తీసుకుంటుంది. సెల్పీ తీసుకుంటున్న సమయంలో ఆ అమ్మాయి చాలా రకాల హావాభావాలను పలికిస్తుంది. ఇదంతా చూస్తున్న ఆ పోట్టేలు ఆ యువతిని ఢీ కొట్టాలని ప్రయత్నించి రెండు సార్లు విఫలమైంది. చివరకు ఆ పోట్టేలు గట్టిగా యువతి తలకు ఢీకోట్టేడంతో ఆ యువతి, ఫోన్ ఎక్కడో ఎగిరి పడ్డాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.



Tags

Read MoreRead Less
Next Story