వీధి కుక్కను తప్పించబోయి తల్లిని..

వీధి కుక్కను తప్పించబోయి తల్లిని..
X

ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తూ వీధికుక్కలు వెంబడించి చాలా యాక్సిడెంట్లు జరుగుతుంటాయి. ఒక్కోసారి ప్రాణాపోయిన సంఘటనలు కూడా వెలుగు చూస్తుంటాయి. తాజాగా తల్లితో బండిమీద వెళుతున్నా కానిస్టేబుల్ కి వీధి కుక్క వెంబడించడంతో బండి స్కిడ్ అయి వెనుక కూర్చున్న తల్లి క్రిందపడిపోయి ప్రాణాలు కోల్పోయింది. అల్వాల్ లోని తిరుమల ఎన్‌క్లేవ్‌లో పోలీస్ కానిస్టేబుల్ ఫిలిప్స్, తన తల్లి చంద్రమ్మతో పాటు రెండు పెంపుడు కుక్కపిల్లలను తీసుకుని బయటకు వచ్చాడు. అదే సమయంలో వీధి కుక్కలు బైక్ ను వెంబడించాయి. దీంతో ఫిలిప్స్ బైక్ వేగాన్ని పెంచాడు. ఆ వేగానికి బండి అదుపుతప్పి చంద్రమ్మ కింద పడింది. ఆమె తలకు తీవ్ర గాయాలు కావడంతో దగ్గర్లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అప్పటికే చంద్రమ్మ మృతి చెందిందని వైద్యులు ధ్రువీకరించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

RELATED STORIES