ఎంతకు తెగించార్రా... బ్రిడ్జీనే దొంగలించేశారు

ఎంతకు తెగించార్రా... బ్రిడ్జీనే దొంగలించేశారు
ఆదానీ కంపెనీకి చెందిన 6 వేల కిలోల ఐరన్‌ బ్రిడ్జిని ఎత్తుకెళ్లిన దొంగలు...నలుగురు నిందితులను అరెస్ట్‌ చేసిన పోలీసులు...

అది వాహనదారులతో నిత్యం రద్దీగా ఉండే పాత్రం. అక్కడ ఒక దొంగతనం జరిగింది. ఆ ఇలాంటివి మామూలే అనుకుంటున్నారా... కానీ ఈ చోరీ గురించి తెలిస్తే... మీరు ముక్కున వేలేసుకోవాల్సిందే. ఎందుకంటే ఆ చోరులు ఎత్తుకెళ్లింది... బంగారమో.. డబ్బో... వాహనామో కాదు. ఇనుప వంతెన. మీరు వింటున్నది అక్షరాల నిజం ౯౦ అడుగుల పొడువు, 6వేల కిలోల బరువున్న ఐరన్‌ బ్రిడ్జిని దొంగలు మాయం చేసేశారు. గ్యాస్‌ కట్టర్లు, ఇతర పరికరాలు ఉపయోగించి దర్జాగా ఆదానీ సంస్థకు చెందిన ఇనుప వంతెనను మాయం చేసేశారు. ఇంతకీ ఈ మహా దొంగతనం ఎక్కడ జరిగిందంటే...


మహారాష్ట్ర మలాడ్‌ పశ్చిమ ప్రాంతంలో ఓ కాలువపై ప్రముఖ వ్యాపార సంస్థ అదానీకి చెందిన భారీ ఎలక్ట్రిక్ కేబుళ్లను తరలించేందుకు గతేడాది తాత్కాలిక ఇనుప వంతెనను ఏర్పాటు చేశారు. అయితే తర్వాత ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆ కాలువపై మరో వంతెనను నిర్మించారు. దాంతో ఆ పాత ఇనుప వంతెనను వినియోగించట్లేదు. ఈ వంతెనను చోరీ చేయాలని భావించిన నిందితులు అదను చూసి దాన్ని ఎత్తుకెళ్లి పోయారు. రద్దీగా ఉండే ప్రాంతం నుంచి ఐరన్‌ వంతెన మాయం కావడం చర్చనీయాంశంగా మారింది. దీంతో కంపెనీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అధికారులు దర్యాప్తు చేపట్టారు. దొంగతనం జరిగిన తీరును తెలుసుకున్న అధికారులు విస్తుపోయారు. ఘటనా స్థలంలో సీసీ కెమెరాలు లేకపోవడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో అమర్చిన నిఘా కెమెరాల ఫుటేజీని పోలీసులు పరిశీలించారు. వంతెన వైపుగా పెద్ద వాహనం వచ్చిన గుర్తించారు.


ఆ వాహనంలో గ్యాస్‌ కట్టింగ్‌ మిషన్లు కనిపించాయి. ఆ వాహనం రిజిస్ట్రేషన్‌ నంబర్‌ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. ఈ కేసులో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వంతెన నిర్మాణానికి కాంటాక్ట్‌ ఇచ్చిన కంపెనీ ఉద్యోగి పాత్ర ఇందులో ఉందని గుర్తించారు. అతనితో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేశారు. సంఘటనా స్థలం నుంచి ఎత్తుకువెళ్లిన సామగ్రిని సైతం స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వివరించారు. ఈ చోరీ వెనుకా ఇంకెవరైనా ఉన్నారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

అంతకుముందు బిహార్‌లోనూ ఇలాంటి ఘటనే జరిగింది. బాంకా జిల్లా చందన్‌బ్లాక్‌లో 2004 నాటి 80 అడుగుల ఐరన్‌ బ్రిడ్జ్‌ను గ్యాస్‌ కట్టర్ల సాయంతో ముక్కలుగా చేసి ఎత్తుకెళ్లారు. ప్రస్తుతం 70 శాతం వంతెన మాయమైంది.

Tags

Read MoreRead Less
Next Story