వధువు కాళ్ళు మొక్కిన వరుడు .. సూపర్ అంటున్న నెటిజన్లు!

ఒక స్త్రీ భర్త ఇంటికి వెళ్ళటానికి తన సొంత ఇంటిని విడిచిపెట్టాలనే నియమావళి ఉంది. అంతేకాకుండా పెళ్ళిలో స్త్రీ తన భర్త పాదాలను తాకి, ఆశీర్వాదం తీసుకోవాలి.

వధువు కాళ్ళు మొక్కిన వరుడు .. సూపర్ అంటున్న నెటిజన్లు!
X

హిందూ సాంప్రదాయ వివాహా వ్యవస్థలో చాలా సాంప్రదాయాలు ఉన్నాయి. ఇందులో ఎక్కువ పితృస్వామ్యమైనవేనని చెప్పాలి. ఉదాహరణకు, ఒక స్త్రీ భర్త ఇంటికి వెళ్ళటానికి తన సొంత ఇంటిని విడిచిపెట్టాలనే నియమావళి ఉంది. అంతేకాకుండా పెళ్ళిలో స్త్రీ తన భర్త పాదాలను తాకి, ఆశీర్వాదం తీసుకోవాలి. అయితే కొన్ని జంటలు మాత్రం ఈ సాంప్రదాయాలను సమానంగా చూసేందుకు ప్రయత్నం చేస్తున్నాయి.

అందులో ఒకటే ఇది. పశ్చిమ బెంగాల్ లో ఇటీవల ఓ జంట పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లిలో వధువు.. వరుడి ఆశీర్వాదం తీసుకున్న తర్వాత వరుడు కూడా వధువు మోకాళ్లపై వంగి నమస్కరించాడు. స్త్రీ–పురుష సమానత్వం అనేది కేవలం మాటల్లోనే కాదు చేతల్లో కూడా చూపించాలని నిరూపించాడు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దంపతులిద్దరూ పరస్పరం గౌరవం ఇచ్చిపుచ్చుకోవడం నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది.


Next Story

RELATED STORIES