ACCIDENT: కొండ ఆంచున అంబులెన్స్‌.. తప్పిన పెను ప్రమాదం

ACCIDENT: కొండ ఆంచున అంబులెన్స్‌.. తప్పిన పెను ప్రమాదం
అదుపుతప్పి కొండ అంచుకు దూసుకెళ్లిన అంబులెన్స్‌... తప్పిన పెను ప్రమాదం... డ్రైవర్‌, కంపౌండర్‌ను కాపాడిన స్థానికులు...

ప్రమాదానికి గురైన వారిని రక్షించే అంబులెన్స్‌కే పెను ప్రమాదం తప్పింది. లోయ ప్రాంతంలో వెళ్తున్న అంబులెన్స్‌ అదుపు తప్పి కొండ అంచున ఆగిన ఘటన రాజస్థాన్‌లో జరిగింది. రాజస్థాన్‌లోని కరణ్‌పురా లోయలో అంబులెన్స్ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. లోయ ప్రాంతంలో రక్షణగా ఉన్న గోడను అంబులెన్స్‌ అదుపు తప్పి ఢీ కొట్టింది. అతి వేగానికి ప్రహరీ కూలిపోయి.. వాహనం ముందుకు దూసుకెళ్లి కొండ అంచున ఆగింది. డ్రైవర్‌, కంపౌండర్‌ అంబులెన్స్‌లోనే చిక్కుకుపోయారు. కొండ చివరన వాహనం వేలాడడం చూసిన స్థానికులు వెంటనే స్పందించారు. అందులో ఉన్న ఇద్దరిని రక్షించారు. లోయ గుండా వెళుతుండగా అంబులెన్స్ ఒక్కసారిగా అదుపు తప్పి, భద్రతా గోడను పగులగొట్టి, కొండ అంచు వరకూ వెళ్లిందని పోలీసులు తెలిపారు. స్థానికులు వచ్చే వరకు డ్రైవర్, కంపౌండర్ అంబులెన్స్‌లోనే ఉన్నారని తెలిపారు. వారిని రక్షించి ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు.

Tags

Read MoreRead Less
Next Story