చెట్లను పెళ్లి చేసుకున్న ఈ మహిళల గురించి తెలుసా?

చెట్లను పెళ్లి చేసుకున్న ఈ  మహిళల గురించి తెలుసా?
American Womens: తొలి చూపులోనే ప్రేమలో పడుతుంటారు. ప్రేమ ఎప్పుడు పుడుతుంది అనేది కచ్చితంగా చెప్పలేం.

లవ్ ఎట్ ఫస్ట్ సైట్.. తొలి చూపులోనే ప్రేమలో పడుతుంటారు. ప్రేమ ఎప్పుడు పుడుతుంది అనేది కచ్చితంగా చెప్పలేం. ప్రేమ ఎప్పుడైనా.. ఎవరితోనైనా కలగవచ్చు. అదో అందమైన అనుభూతి. ఒకరిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తే వారితో జీవితాంతం బ్రతికేయాలనిపిస్తుంది. అయితే ఇద్దరు మహిళలు మాత్రం పకృతిని ప్రేమిస్తున్నారు. అంతేకాకుండా వాటిని పెళ్లి చేసుకన్నారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఈ ఘటన అమెరికాలో చోటుచేసుంది. వివరాలు.. అమెరికాకు చెందిన అన్నీ స్ప్రింక్లే, బెత్ స్టీఫెన్స్ చెట్లతో ప్రేమలో పడ్డారు. వారు చెట్లను ప్రేమిస్తున్నట్లు 2004లో గ్రహించారు.

ఈ క్రమంలోనే చెట్లను 2008లో వివాహం చేసుకన్నారు. వీరు ఈ విషయాలను ప్రపంచానికి వెల్లడించారు. అన్నీ స్ప్రింక్లే, బెత్ స్టీఫెన్స్‌ వీరికి పకృతిని అమితంగా ఇష్టపడతారు. చెట్టు అంటే ఎంతో ప్రేమ.. దీంతో చెట్లను పెళ్లి చేసుకున్నారు. వారిద్దరు తమని తామే ఎకో-సెక్సువల్‌గా ప్రకటించుకున్నారు. ఈ జంట 2008లో 300 మంది సమక్షంలో చెట్లను వివాహం చేసుకున్నారు. ఈ జంట చెట్లను ఎందుకు వివాహం చేసుకున్నారు అని చాలా మంది ఆశ్చర్యపోయారు.

అన్నీ స్ప్రింక్లే, బెత్ స్టీఫెన్స్ శాన్ ఫ్రాన్సిస్కోలోని రట్జర్స్ విశ్వవిద్యాలయంలో కలుసుకున్నారు. ఆ యూనివర్సీటీలో ఇద్దరు మంచి మిత్రులు.. ఒకరిని ఒకరు బాగా అర్థం చేసుకున్నారు. ఎప్పుడు చెట్ల గురించే వీరి మాటలు. ఈ క్రమంలోనే వారు తాము చిన్న చిన్న పిల్లల కంటే చెట్లను ఎక్కువగా ప్రేమిస్తున్నామని గ్రహించారు. వీరు చెట్లను కౌగిలించుకోవడమే కాకుండా.. వాటి వేర్లను కౌగిలించుకున్నారు. తమ ప్రేమ కథ చెట్లను రక్షించడానికి ప్రపంచాన్ని ప్రోత్సహిస్తుందని అన్నీ స్ప్రింక్లే, చెత్ స్టీఫెన్స్ చెబుతారు. వీరిద్దరు చెట్లను మాత్రమే కాకుండా పర్వతాలు, కొండలను కూడా అమితంగా ప్రేమిస్తారు.

Tags

Read MoreRead Less
Next Story