Andhra Pradesh: రిటర్న్ గిఫ్ట్ కోరిన కొత్త జంట; వెల్లువెత్తుతున్న ప్రశంసలు

Nidadavolu
Andhra Pradesh: రిటర్న్ గిఫ్ట్ కోరిన కొత్త జంట; వెల్లువెత్తుతున్న ప్రశంసలు
పెళ్లికి విచ్చేసిన వారికి కొత్త జంట కండీషన్; అవాక్కయినా.. వారి మంచి మనసుకు జేజేలు కొట్టిన బంధువర్గం; మేము సైతం అంటూ అవయవదానానికి ముందడుగు

Andhra Pradesh: రిటర్న్ గిఫ్ట్ కోరిన కొత్త జంట; వెల్లువెత్తుతున్న ప్రశంసలు


సాధారణంగా పెళ్లి రోజున అందరిని ఆకర్షించేలా పెళ్లి కార్డులు, విందుభోజనాలు, రిటర్న్ గిఫ్ట్ లు ప్లాన్ చేస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్‌లోని ఓ జంట తమ పెళ్లిరోజున ఓ మంచి పని చేయాలని నిర్ణయించుకున్నారు. ఏకంగా అవయవ దానం చేయడానికి పూనుకున్నారు. ఈ వినూత్న ఘటన తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని చోటుచేసుకుంది.


వేలివెన్ను గ్రామానికి చెందిన సతీష్ కుమార్ కు సజీవ రాణితో డిసెంబర్ 29న వివాహం జరుగనుంది. ఈ నేపథ్యంలో సతీష్ అవయవదానానికి ప్రతిజ్ఞ చేసేలా ఇతరులను కూడా ప్రోత్సహించాలని నిర్ణయించుకున్నాడు. దీంతో పెళ్లి కార్డుపై అదే సందేశాన్ని ముద్రించాలని ఆలోచన చేశాడు. 'అవయవాలు దానం చేయండి–ప్రాణాలను రక్షించండి' అంటూ కార్డు పై ముద్రించాడు. ఆ సందేశాన్ని చూసిన ఆహ్వానితులు, బంధువులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైయ్యారు.

ఇక తమ పెళ్లి రోజున ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహించాలని నిర్ణయించుకున్న సతీశ్ బాటలోనే నవ వధువు రాణి కూడా పయనించాలనుకుంది. ఇది చూసి మంత్ర ముగ్ధులైన వారి బంధువుల్లో ఏకంగా 60 మంది అవయవ దానం ఫారమ్‌లను పూరించడానికి ముందుకు వచ్చారు. ఏమైనా ఆర్భాటంగా వివాహ వేడుకలు జరుపుకునే కన్నా బంధుమిత్రుల్లో అవయవదానంపై అవగాహన కల్పించడమే శ్రేయస్కారమనుకున్న ఈ జంట నిండు నూరేళ్లూ సుఖ సంతోషాలతో బతకాలని అందరూ దీవిస్తున్నారు.



Tags

Read MoreRead Less
Next Story