Bhopal Professor: కోపంతో విచక్షణ కోల్పోయిన మహిళా ప్రొఫెసర్..

Bhopal Professor: కోపంతో విచక్షణ కోల్పోయిన మహిళా ప్రొఫెసర్..
Bhopal Professor: రోడ్ల మీద చిన్న చిన్న పొరపాట్లు సహజం. అలాంటి పొరపాట్లకే ట్రాఫిక్ జామ్ అయ్యేలాగా గొడవ పడుతుంటారు కొందరు

Bhopal Professor: కోపం వస్తే ఎవరైనా విచక్షణ లేకుండా ప్రవర్తించడం మనం చాలాసార్లు చూసే ఉంటాం. కోపం మనుషులతో ఏ పనైనా చేయిస్తుంది. ఒక్కొక్కసారి చిన్న చిన్న విషయాలకు కోప్పడడం వల్ల అది ఎన్నో పెద్ద పరిణామాలకు దారితీస్తుంది. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఓ మహిళ ప్రొఫెసర్ కూడా ఓ చిరు వ్యాపారిపై తన కోపాన్నంతా చూపించి అతడికి నష్టం కలిగేలా చేసింది.

రోడ్ల మీద చిన్న చిన్న పొరపాట్లు సహజం. కానీ అలాంటి పొరపాట్లకే ట్రాఫిక్ జామ్ అయ్యేలాగా గొడవ పడుతుంటారు కొందరు. ఈ మహిళ ప్రొఫెసర్ విషయంలో కూడా జరిగింది. రోడ్డు పక్కన తన కారు పార్క్ చేసి ఉంది. పొరపాటున అటుగా వెళ్తున్న ఓ చిరు వ్యాపారి తోపుడు బండి ఆ కారుకు తగిలింది. అంతే ఆ ప్రొఫెసర్ విచక్షణ కోల్పోయింది.

ఇంట్లో నుండి ఈ విషయాన్ని గమనించిన ఆ ప్రొఫెసర్.. ఒక్కసారిగా ఆ చిరు వ్యాపారిపై విరుచుకుపడింది. అతడు వద్దని ఎంత ప్రాధేయపడుతున్నా వినకుండా అతడి తోపుడు బండి మీద ఉన్న పండ్లన్నీ రోడ్డు మీద పడేసింది. దారిన పోయే వాహనదారులు ఆమె అనూహ్య ప్రవర్తనను వీడియో తీస్తున్నా కూడా ఆగకుండా అలాగే చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా కూడా మారింది.

Tags

Read MoreRead Less
Next Story