సరిగ్గా తాళి కట్టే సమయానికి పెళ్లి కొడుక్కి షాకిచ్చిన పెళ్లి కూతురు

సరిగ్గా తాళి కట్టే సమయానికి పెళ్లి కొడుక్కి షాకిచ్చిన పెళ్లి కూతురు
X

సరిగ్గా తాళి కట్టే సమయానికి.. ఎవరో ఒకరు వచ్చి పెళ్లి ఆపే ఘటనలు సినిమాల్లో చూసి ఉంటాం. అచ్చం అలాంటి ఘటనే తమిళనాడులో నీలగిరిలో జరిగింది. అయితే..ఈ పెళ్లిని ఆపింది ఎవరో కాదు.. సాక్షాత్తు పెళ్లి కూతురే! వరుడు తాళి కట్టే సమయంలో... ఈ పెళ్లి తనకు ఇష్టం లేదంటూ చేప్పేసింది వధువు. తన ప్రియుడు అరగంటలో వస్తాడని, అప్పటి వరకు పెళ్లి ఆపాలని పట్టుబట్టింది. దీంతో పెళ్లి కొడుకుతో పాటు పెళ్లికొచ్చినవారంతా షాకయ్యారు.

పెళ్లి కూతురికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా... ఫలితం లేకపోయింది. చివరికి బంధువులంతా కొట్టేందుకు ప్రయత్నించడంతో.... వధువు తిరగబడింది. తన ప్రియుడు వచ్చేంత వరకు పెళ్లి చేసుకునేది లేదని తేల్చి చెప్పింది. ఇంత జరిగాక.. ఈ పెళ్లి జరగదని నిర్ణయించుకున్న వరుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కానీ ఎంత సేపు వేచి చూసినా.. వధువు చెప్పిన ప్రియుడు రానే లేదు. దీంతో పెళ్లికూతురుని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు బంధువులు. ఈ ఘటన సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.

Next Story

RELATED STORIES