Viral Video: అత్తపై ప్రేమతో కోడలు ఎంత చేసిందో చూడండి..!

Viral Video: అత్తపై ప్రేమతో కోడలు ఎంత చేసిందో చూడండి..!

60 varieties of food

Viral Video: ఏ టివీ సీరియల్ లో చూసిన అత్తాకోడళ్ల మధ్య పచ్చగడ్డి వేసిన భగ్గున మండే వైరం ఉంటుంది.

Viral Video: ఏ టివీ సీరియల్ లో చూసిన అత్తాకోడళ్ల మధ్య పచ్చగడ్డి వేసిన భగ్గున మండే వైరం ఉంటుంది. అత్తా కోడళ్ల వార్ తోనే సీరియల్స్ రక్తికడుతుంటాయి. అత్తాకోడళ్లు కలిసి మెలిసి వాళ్లు చాలా అరుదు. అయితే ఇక్కడ ఓ కోడలు అత్తకోసం అందుకు భిన్నం అంటుంది. అత్తగారిపై కోడలు చూపించిన ప్రేమను చూసి అంతా షాక్ అవుతున్నారు. ఇప్పుడు ఆ కోడలి చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాళ్లోకి వెళ్తే.. పశ్చిమగోదావరి జిల్లాలో ఓ కుటుంబంలో.. అత్తగారి పుట్టినరోజున ఆ ఇంటి కోడలు ప్రత్యేక వంటకాలను తయారు చేసింది. అంతేకాదు వంటకాలను ప్లాస్టిటిక్ బాక్సుల్లో నింపి వాటిపై పేర్లు రాసింది.

ఇంతకు ఆ కోడలు వంటకాలు ఎందుకు చేసింది. అందులో స్పెషల్ ఏముంది అనుకుంటున్నారా?. అత్తగారికి 60 ఏళ్లు రావడంతో 60 రకాల వంటలను తయారు చేసి అత్తగారికి కానుకుగా ఇచ్చింది. పులిహోర, కొబ్బరి రైస్, మ్యాగీ నూడిల్స్, వంకాయ బజ్జీ, పెరుగు ఇడ్లీ, ఇలా చాలా రకాలు ఉన్నాయి. కోడలి ప్రేమను ఇలా వంటకాల రూపంలో చూపించడంతో అత్త ఉబ్బితబ్బిపోతుంది. ఇక కోడలి వంటకాల వీడియోకు ప్రస్తుతం నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అత్తగారంటే ఎంత ప్రేమ ఉంటే మాత్రం ఇంత పని చేస్తారా అంటూ నోరు వెళ్లబెడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఓ అల్లుడికి మామ పెట్టిన ఆషాడం సారె వైరల్ అవ్వగా.. ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్తాకోడళ్ళ బంధం వైరల్ అవుతోంది.



Tags

Read MoreRead Less
Next Story