వామ్మో.. వీళ్లు బ్యాట్స్ పట్టారు.. వార్నర్ ఇన్‌స్టా ఫిక్.. నెటిజన్లు ఫిదా

క్రికెట్ బ్యాట్లు ప‌ట్టుకున్న ముగ్గురు చిన్నారుల ఫిక్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు

వామ్మో.. వీళ్లు బ్యాట్స్ పట్టారు.. వార్నర్ ఇన్‌స్టా ఫిక్.. నెటిజన్లు ఫిదా
X

ఆస్ట్రేలియా క్రికెట‌ర్ డేవిడ్ వార్న‌ర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. తీరిక సమయంలో వీడియోలు చేస్తూ.. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అభిమానులను అట్రాక్ట్ చేస్తుంటాడు వార్నర్. లాక్‌డౌన్‌ టైంలో త‌న ముద్దుల కూతుళ్ల‌తో కలిసి చేసిన టిక్‌టాక్ వీడియోలు.. క్రికెట్ ఫ్యాన్స్‌ను అలరించాయి. ఇటీవల ఇన్‌స్టాలో త‌న కూతుళ్ల‌తో క్రికెట్ ఆడుతున్న వీడియోను పోస్ట్ చేసిన వార్నర్.. తాజాగా మరొ కొత్త ఫోటోను పోస్ట్ చేశాడు. క్రికెట్ బ్యాట్లు ప‌ట్టుకున్న ముగ్గురు చిన్నారులు ఆ ఫోటోలో ఉన్నారు. ఐవీ మే, ఇండీ రే, ఇస్లా రోజ్‌లు బ్యాట్లు ప‌ట్టుకుని ఫోటోకు స్మైల్ ఇచ్చారు. ఈ ఫిక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కాగా డిసెంబర్ 26న మెల్‌బోర్న్‌లో జ‌ర‌గ‌నున్న బాక్సింగ్ డే టెస్టులో వార్నర్ ఆడే అవ‌కాశాలు ఉన్నాయి.

Next Story

RELATED STORIES