ఒంటి కాలితో 'చికినీ చమేలి' డ్యాన్స్.. నెటిజన్లు ఫిదా..

ఒంటి కాలితో చికినీ చమేలి డ్యాన్స్.. నెటిజన్లు ఫిదా..
అంగవైకల్యం మనిషికే కాని మనసుకేం లేదంటూ వీక్షలను కళ్లు తిప్పుకోనివ్వకుండా చేసింది ఆమె నృత్యం.

అంగవైకల్యం మనిషికే కాని మనసుకేం లేదంటూ వీక్షలను కళ్లు తిప్పుకోనివ్వకుండా చేసింది ఆమె నృత్యం. వికలాంగ నృత్యకారిణి సుబ్రీత్ కౌర్ ఘుమ్మన్ ఇటీవల చికినీ చమేలి అనే పాటకు డ్యాన్స్ చేసి నెటిజన్ల హృదయాలను దోచుకున్నారు.

ఇండియా గాట్ టాలెంట్ షోలో పాల్గొన్నప్పుడు సుభ్రీత్ మొదటి రౌండ్‌తో జడ్జిలను మెప్పించి రెండవ రౌండ్‌కు అర్హత సాధించింది. "7 సంవత్సరాల తరువాత నా మొదటి టీవీ డాన్స్ ప్రదర్శనను మళ్లీ మీకోసం చేస్తున్నాను. ఇది మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను" అనే క్యాప్షన్‌తో ఆమె ఈ వీడియోను అప్‌లోడ్ చేసింది.

సుభ్రీత్ కౌర్ 2009 లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయింది. అనంతరం వైద్యులు ఆమె కాలికి ఏడు ఆపరేషన్లు చేశారు. మొట్ట మొదటి శస్త్ర చికిత్సలోనే వైద్యులు ఏమరపాటుతో ఒక ముఖ్యమైన సిరను కత్తిరించారు. దాంతో ఆమె పరిస్థితి మరింత దిగజారింది. అంటువ్యాధులు చుట్టుముట్టాయి. దాంతో ఒక కాలుకి బాగా ఇన్ఫెక్షన్ అయి దాన్ని తొలగించాల్సి వచ్చింది. వైద్యులు చేసిన పనికి ఆమె కాలుని కోల్పోయింది. అయినా కృంగి పోలేదు.

ఒంటి కాలుతోనే తనకు ఇష్టమైన డ్యాన్స్ సాధన చేసింది. అమ్మానాన్నకి తాను డ్యాన్సర్ కావడం ఇష్టం లేదు. బాగా చదువుకుని నర్స్ ఉద్యోగం చేయాలనుకున్నారు. కానీ ఆమెకు జరిగిన ప్రమాదం ఆమె జీవితాన్ని మార్చేసింది. ప్రమాదం నా కాలును తీసుకుని, నా కలలను నెరవేర్చాలనే సంకల్పం ఇచ్చింది. ఇప్పుడు నేను జీవించడం కోసం నాట్యం చేస్తున్నాను. నేను నాట్యాన్ని ఎంతో ప్రేమిస్తాను అంటారు సుబ్రీత్.

Tags

Read MoreRead Less
Next Story