Most Expensive Dogs.. క్యూట్ పప్పీస్.. ఇవి చాలా కాస్ట్లీ గురూ!

Most Expensive Dogs.. క్యూట్ పప్పీస్.. ఇవి చాలా కాస్ట్లీ గురూ!

Most Expensive Dogs

Most Expensive Dogs.. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఖరీదైన క్యూట్ పప్పీస్.. వామ్మో.. మరి..ఇంత కాస్టా..!

Most Expensive Dogs :

విశ్వాసానికి మారు పేరు శునకం.. ప్రేమగా పిడికెడు అన్నం పెడితే చాలు.. మనకోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనుకాడని ప్రియమైన జంతువు. అందుకే డాగ్స్‌ను ఎంతో అమితంగా పెంచుకుంటుంటారు. ఇక ముద్దుగుమ్మలు.. వాళ్ల ఫియాన్సీ కంటే పప్పీస్‌నే ఎక్కువ ప్రేమించేస్తున్నారు. డాగ్స్‌తో కలసి జీవిస్తున్నారు.. అవి కూడా ఎంతో బాధ్యతగా మెలుగుతుంటాయి. ఈ మద్యకాలంలో డాగ్స్ ను పెంచుకోవటం ఫ్యాషన్‌గా మారింది.

మీరు కూడా డాగ్స్‌ని పెంచుకుంటున్నారా? అయితే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనా డాగ్స్ జాతి గురించి తెలిస్తే.. వామ్మో.. ఇంత కాస్టా.. అని నోరెళ్లబెడతారు!

కావలీర్ కింగ్ చార్లెస్ స్పానియల్ (Cavalier King Charles Spaniel) :

కావలీర్ కింగ్ చార్లెస్ స్పానియల్.. యునైటెడ్ కింగ్‌డమ్‌లో ఈ డాగ్ చాలా ఫేమస్. ఇది ల్యాప్ డాగ్‌గా ప్రసిద్ది చెందింది. మెత్తటి చెవులతో.. చాలా ఫ్రెండ్లీ డాగ్. కావలీర్ కింగ్ చార్లెస్ స్పానియల్.. ధర లక్షరూపాయల పైనే ఉంటుంది.


చెకోస్లోవేకియన్ వోల్ఫ్డాగ్ ( Czechoslovakian Wolfdog) :

చెకోస్లోవేకియా వోల్ఫ్డాగ్.. వెండి-బూడిద మరియు పసుపు-బూడిద రంగులో ఉంటాయి. ఇది తోడేలులా కనిపించినప్పటికీ.. చాలా ఫ్రెండ్లీగా.. ఉల్లాసంగా.. ఉత్సాహంగా ఉంటుంది. చెకోస్లోవేకియన్ వోల్ఫ్డాగ్ తోడేళ్ళు మరియు కాపలా శునకాల క్రాస్ బ్రీడ్. చెకోస్లోవేకియన్ వోల్ఫ్డాగ్ చాలా అరుదు.. ఇవి కేవలం 340 మాత్రమే అధికారికంగా నమోదు అయ్యాయి. అందుకే వీటి ధర కూడా ఎక్కువే.. రూ. 50వేల నుండి లక్షన్నర వరకు ఉంటుంది.


సెయింట్ బెర్నార్డ్ (St Bernard) :

సెయింట్ బెర్నార్డ్ .. ఇటాలియన్ మరియు స్విస్ ఆల్ప్స్ లో చాలా ఫేమస్. ఇది 35 అంగుళాల పొడవు ఉంటుంది. సెయింట్ బెర్నార్డ్‌.. ఒక రెస్క్యూ డాగ్. ఇటాలియన్-స్విస్ సరిహద్దు వద్ద మంచులో చిక్కుకున్న వారికి సహాయపడుతుంది. సెయింట్ బెర్నార్డ్ ధర లక్షా 32 వేల వరకు ఉంటుంది.



బెడ్లింగ్టన్ టెర్రియర్ (Bedlington Terrier) :

బెడ్లింగ్టన్ టెర్రియర్.. ఈశాన్య ఇంగ్లాండ్‌లో ఈ డాగ్స్‌ని రోత్బరీస్ లాంబ్ అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ డాగ్స్ ను క్రిమికీటకాలను వేటాడేందుకు పెంచుకుంటారు. అయితే ఇది ప్రస్తుతం డాగ్స్ ప్రదర్శకులకు ఇష్టమైన రేసింగ్ డాగ్‌గా మారింది. బెడ్లింగ్టన్ టెర్రియర్.. ఈత కొట్టడంలో ఫేమస్. బెడ్లింగ్టన్ టెర్రియర్స్ సుదీర్ఘ జీవితకాలం 13.5 సంవత్సరాలు. అందుకే వీటి ధర కూడా చాలా కాస్ట్లీ.. సుమారు లక్షా 30 వేల వరకు ఉంటుంది.

డబుల్ డూడుల్ (Double Doodle) :

డబుల్ డూడుల్.. యునైటెడ్ స్టేట్స్ లో ఎక్కువగా ఉంటాయి. ఇది లాబ్రడూడిల్ మరియు గోల్డెన్‌డూడిల్ మధ్య.. క్రాస్ బ్రీడ్. గోల్డెన్ రిట్రీవర్, పూడ్లే లేదా లాబ్రడార్ రిట్రీవర్‌లను క్రాస్ చేయటం ద్వారా ఇవి పుడతాయి. డబుల్ డూడుల్ శక్తివంతమైనవి. చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి. ఇవి చాలా స్మార్ట్. వీటిని గోల్డెన్ లాబ్రడూడిల్ మరియు నార్త్ అమెరికన్ రిట్రీవర్ అని కూడా పిలుస్తారు. డబుల్ డూడుల్ బంతిని ఆడటం ఇష్టపడే చురుకైన డాగ్స్. అయితే ఇది స్వచ్ఛమైన జాతి కానప్పటికీ వీటి ధర సుమారు రూ. లక్షా 30 వేల వరకు ఉంటుంది.


Tags

Read MoreRead Less
Next Story