Ghost viral videos.. ఈ వీడియోల వెనుక అసలు నిజాలు తెలిస్తే షాక్!

Ghost viral videos.. ఈ వీడియోల వెనుక అసలు నిజాలు తెలిస్తే షాక్!

Ghost Viral Videos Real or Fake Image

Ghost Viral Videos.. దెయ్యాలు ఉన్నాయనేది ఎంత వరకు నిజం? అసలు దెయ్యాలు ఉన్నాయా లేవా?

Ghost Viral Videos.. దెయ్యాన్ని ఎప్పుడైనా చూశారా? పోనీ చూడాలనుకుంటున్నారా? దెయ్యాలు ఉన్నాయనేది ఎంత వరకు నిజం? అసలు దెయ్యాలు ఉన్నాయా లేవా.. ఈ ప్రశ్నలకు అనేక సమాధానాలు వస్తాయి. Ghostపై పరిశోధనలు చేసేవారు దెయ్యాలు ఉన్నాయంటూ.. కొన్ని ఆధారాలు, ఫోటోలు, వీడియోలను చూపిస్తుంటారు. అవేవీ నమ్మదగ్గ విధంగా లేవని.. ఆ ఫోటోలు, వీడియోలు అస్పష్టంగా ఉన్నాయంటూ మరికొంత మంది వాటిని కొట్టిపడేస్తారు.

అందుకే దేవుడు, దెయ్యం టాపిక్స్ ఎప్పుడూ సెన్సేషనల్‌గా మారతాయి. సోషల్ మీడియా డెవలప్ అయ్యాక ఈ టాపిక్స్ మరింత వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో పారానార్మల్ షూటింగ్స్ ఈ మధ్య కాలంలో తెగ హల్‌చల్ చేస్తున్నాయి. అలాంటి కొన్ని వీడియోలు గురించి తెలుసుకుంటే వార్నీ.. ఇవి నిజం దెయ్యాల వీడియోలు కాదా అని మీకే అనిపిస్తుంది. అంతలావాటిని క్రియేట్ చేస్తారు.

అచ్చం హాలీవుడ్ సినిమాల్లో కనిపించే సీన్.. ఇటీవల తెలంగాణలో మహబూబాబాద్‌ జిల్లాలో కనిపించింది. తెల్లని ముసుగతో.. స్లో మోషన్ నడకతో.. చూడగానే భయపడేలా సీన్ క్రియేట్ చేశారు. ఈ దెయ్యం మహబూబాబాద్ జిల్లా జంగిలిగొండ గ్రామశివారులోని గుట్టల వద్ద తిరుగుతోంది. ఎవరైనా కావాలని చేస్తున్నారా లేదా అన్నది తెలియదు కానీ.. ఈ దృశ్యాలు చూసిన జనాలు భయపడి ఛస్తున్నారు.

జంగిలిగొండ స్టేజీ నుంచి VS లక్ష్మీపురం, నర్సింహులపేట, కౌసల్యాదేవిపల్లి గ్రామాలకు ఈ రోడ్డు మీదుగానే వెళ్లాల్సి ఉంటుంది. అయితే, గత 15 రోజులుగా ఈ ప్రాంతంలో దెయ్యం తిరుగుతోందని ప్రచారం జరగడంతో.. రాత్రిళ్లు బయటికి వెళ్లాలంటేనే భయపడుతున్నారు. చివరికి పొలాలకు వెళ్లాలన్నా సరే స్థానికులు వణికిపోతున్నారు.

Also Read :

నేను పార్టీ పెట్టడం జగన్‌కు ఇష్టం లేదు : షర్మిల

వంటలక్క అత్త గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

ఘట్‌కేసర్ ఫార్మసీ అమ్మాయి సూసైడ్ కేసులో ట్విస్ట్..!

ఇటీవల సన్స్ రిపోర్ట్ ఓ వీడియోని రిలీజ్ చేసింది. అందులో ఓ వ్యక్తి రోడ్డుపై నడుస్తూ వెళ్తున్నట్లు.. వాహనం ఢీ కొట్టినట్టు ఉంటుంది. కానీ అక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఢీకొట్టిన వాహనం ఆగదు. మరో వాహనం కూడా ఆ వ్యక్తిని ఢీ కొడుతుంది. వరుసగా రెండు, మూడు వాహనాలు ఢీకొట్టినా.. ఆ వ్యక్తి మాత్రం రోడ్డు దాటుతూ వెళ్తుంటాడు. నిజంగా అతడు వ్యక్తి అయితే.. అలా జరగడం అసాధ్యం. కానీ అది దెయ్యం కాబట్టే అలా జరిగిందని సోషల్ మీడియాలో.. ఆ వీడియో వైరల్ అయింది.

ఆ వీడియోలో విచిత్రమైన మనిషి లాంటి నీడ.. రోడ్డుపై నడుస్తూ.. వాహనాలు అడ్డు వస్తున్నా రోడ్డు దాటుతూ వెళ్లిన దృశ్యాలు అందర్నీ ఆశ్చర్యపరిచాయి. ఈ ఘటన ఫిలిప్పీన్స్ లోని పంగాసినాన్ నగరంలో ఓ కిరాణా షాపు ముందు జరిగింది. ఆ షాపు సీసీ టీవీ ఫుటేజ్ లో ఇది కనిపించింది. ఈ ఘటనపై దెయ్యాలున్నాయని నమ్మే స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. అయితే హేతువాదులు దీనికి సమాధానం ఇచ్చారు. కిరణా షాపు కెమెరా అద్దం ముందు ఓ వ్యక్తి నడిచి వెళ్లినప్పుడు.. రిఫ్లెక్ట్ అయ్యి అలా జరిగిందని తేల్చారు.



ఆత్మలు లేవు.. దెయ్యాలు లేవు అనే వాళ్లు కూడా ఒక్కోసారి దెయ్యాల్లాంటి ఆకారాలను చూసి భయపడిపోతుంటారు. అమెరికాలో ఓ మహిళకు ఎదురైన విచిత్ర సంఘటన ఆమెకు చెమటలు పట్టించింది.

ఇల్లినాయిస్ నగరానికి చెందిన ఓ మహిళ తన 18 నెలల కొడుకుని మంచంపై పడుకోబెట్టి.. తన వర్క్‌లో నిమగ్నమైంది. అయితే ఓ మోనిటర్ ద్వారా ఆ పిల్లవాడిని ఎప్పటికప్పుడు కనిపెట్టుకుని ఉంటూ..తన వర్క్ చేసుకునేది. ఈ క్రమంలో ఒక్కసారిగా తన పిల్లాడి పక్కనే మరొక పిల్లవాడు పడుకున్నట్టుగా మోనిటర్‌లో కనిపించింది. తదేకంగా చూసిన ఆమెకి ఆ పిల్లాడు నవ్వుతున్నట్టుగా కనపడింది. దీంతో ఆమెకు చెమటలు పట్టాయి. అది దెయ్యమనుకుని భయంతో పరుగులు తీసింది.

తీరా చూస్తే తన పిల్లాడి పక్కన ఉన్నది పరుపు కంపెనీ స్టికర్‌పై నవ్వుతున్న పిల్లాడిబొమ్మ. తన భర్త పరుపుపై దుప్పటిని మార్చకపోవడం వలన తానూ ఇలా కంగారుపడ్డాను అని సోషల్ మీడియాలో చెప్పుకొచ్చింది. దీంతో ఆ వీడియో కాస్తా వైరల్ అయింది.

https://fb.watch/3PvO8-aB0M/

దెయ్యాలు ఉన్నాయా.. లేవా అనే పశ్నకు సవాల్ విసిరే ఓ ఘటన ఇటీవల గుజరాత్‌లో చోటుచేసుకుంది. ఓ ఇంటిముందు పార్క్ చేసిన బైక్ దానంతటదే కదిలింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. అక్కడ అర్థరాత్రి వేళ ఓ ఇంటిముందు రెండు బైకులు పార్క్ చేసి ఉన్నాయి. అయితే సడెన్‌గా వీటిలో ఓ బైక్ సైడ్ స్టాండ్ వేసి ఉన్నప్పటికీ.. దానంతట అదే ముందుకు కదిలి.. యూ టర్న్ తీసుకుని కింద పడిపోయింది.

ఈ ఘటన సీసీ టీవీ కెమెరాలో రికార్డయ్యింది. ఈ సీసీ ఫుటేజ్ వీడియోను ఓ మహిళ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. అయితే ఆ వీడియోని చూసిన నెటిజన్లు పలు రకాలు కామెంట్స్ చేశారు. ఆ బైకుకు అదృశ్యశక్తులు ఉన్నాయని కొందరు.. అమ్మో అది దెయ్యం పనేనని మరికొందరు కామెంట్స్ చేశారు. అయితే దెయ్యం గియ్యం జాన్‌తా నయ్.. అది అంతా గ్రాఫిక్సేనంటూ హేతువాదులు తేల్చారు.



అయితే సైన్స్‌కి సవాల్ విసురుతూ ప్రపంచంలో ఎన్నో ఘటనలు జరుగుతున్నాయి. కానీ వీటిపై ఇప్పటి వరకు సృష్టమైన అభిప్రాయం లేదు. కొందరు.. దేవుడు ఉన్నాడన్నది నిజమైతే.. దెయ్యాలున్నాయన్న మాట కూడా వాస్తవమే కదా అని అంటారు. సైన్స్‌కు మించింది.. అసలు ఈ ప్రపంచంలోనే ఏదీ లేదు అనేవాళ్లు మరికొందరు. అలాంటి వారిని సవాల్ చేస్తూ మనిషి మేధస్సుకు అందని సంఘనలు ఇప్పటికే జరిగాయి. ఇంకా జరుగుతూనే ఉన్నాయి.

Tags

Read MoreRead Less
Next Story