వైరల్ : 36ఏళ్ల యువకుడిని పెళ్లాడిన 81ఏళ్ల వృద్ధురాలు!

వైరల్ :  36ఏళ్ల యువకుడిని పెళ్లాడిన 81ఏళ్ల వృద్ధురాలు!
ఫేస్‌బుక్‌లో పరిచయమైన 36 ఏళ్ల ఈజిప్ట్ యువకుడిని బ్రిటన్‌కు చెందిన ఐరిస్ జోన్స్ అనే 81 ఏళ్ల వృద్ధురాలు పెళ్లి చేసుకుంది.

ఫేస్‌బుక్‌లో పరిచయమైన 36 ఏళ్ల ఈజిప్ట్ యువకుడిని బ్రిటన్‌కు చెందిన ఐరిస్ జోన్స్ అనే 81 ఏళ్ల వృద్ధురాలు పెళ్లి చేసుకుంది. అహ్మద్ ఇబ్రహీం అనే ఆ యువకుడు డబ్బుకోసమే తనను ప్రేమించాడని వస్తున్న విమర్శలను ఆమె కొట్టి పారేసింది. తన భర్త ప్రేమలో నిజాయతీ ఉందని ట్రోలర్స్‌కి గట్టిగా సమాధానమిచ్చింది. వారి ప్రేమను ఎవరూ నాశనం చేయలేరంది.

కాగా, తమ శృంగార జీవితమూ సాఫీగా సాగిపోతోందని చెప్పి.. నెటిజన్లకు ఈ బామ్మ షాకిచ్చింది. ప్రస్తుతం ఈజిప్ట్​లో ఉన్న అతడు బ్రిటన్​కు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడని, విమానాలు నిలిచిపోవడంతో అక్కడే చిక్కుకుపోయాడనిచెప్పుకొచ్చింది ఈ బామ్మ. తమ మధ్య ఎడబాటు గురించి కూడా ఆమె ఫీలయ్యారు. కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story