Top

Women s Day : మహిళా దినోత్సవం గురించి ఈ విషయాలు తెలుసా!

Women s Day అప్పటి నుంచీ ఈ రోజును ప్రపంచమంతా మహిళా దినోత్సవంగా జరుపుకుంటోంది.

Women s Day : మహిళా దినోత్సవం గురించి ఈ విషయాలు తెలుసా!
X

women s Day

Women s Day :

ఆమె.. ఆకాశంలో సగం. అనురాగంలో ఘనం. అన్ని బంధాలకు ఆదిమూలం. ఒకప్పుడు వంటి ఇంటికే పరిమితమైన ఆమె.. ఇప్పుడు నేల నుంచి నింగి వరకూ చేయలేని పనిలేదు. చేతకాని పనీ లేదు. కండబలంలో తక్కువ అయినా.. బుద్ధిబలంలో మగవారికంటే ఎన్నో రెట్లు ఎక్కువగా నిరూపించుకుంది. అయినా ఆమెపై అసమానతలు రోజురోజుకూ పెరుగుతున్నదీ నిజం. ఇవాళ మహిళా దినోత్సవం. అంటే అమ్మల రోజు కూడా.

మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ. త్యాగంలో అనురాగంలో తరగని పెన్నిధి మగువ. మహిళ అంటే మానవతామూర్తి.. మహోన్నత భావాలున్న శక్తి. తెగువలోనూ మగువది చరిత్రలో సుస్థిర స్థానమే. ఆమెను ఆకాశంలో సగం అన్నారు. కానీ అది ఆచరణలో మాత్రం జరగడం లేదు. సామర్థ్యంలో అత్యున్నతం అయినా.. సమానత్వంలో అత్యల్పం. ఆ ఆవేదన నుంచి పుట్టిందే ఈ మహిళా దినోత్సవం.

అనాది నుంచే మహిళపై అణచివేత ఉంది. మనిషిగా కాక వస్తువులా చూసిన చరిత్రా ఉంది. మారుతున్న కాలానికి అనుగుణంగా మహిళ తన శక్తిని పెంచుకున్నది. మగవారికి సమానంగా సత్తా చాటుతున్నది. అయినా ఆమెపై వివక్ష తగ్గలేదు. గౌరవం పెరగలేదు. మగవారికి సమానంగా కష్టపడినా సమాన వేతనం ఇవ్వలేదు. ఇదేమనే ప్రశ్న నుంచే ఆమె శక్తి ఈ లోకానికి తెలియడం మొదలైంది.

18వ శతాబ్ధం చివర్లో పాశ్యాత్య దేశాల్లో సమాన హక్కుల కోసం మొదలైన నినాదం 19వ శతాబ్ధం ఆరంభానికి ఊపందుకుంది. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో ఏర్పడిన ఆహార కొరత, శాంతి కోసం సాగిన ఈ పోరాటంలో మహిళా శక్తి లోకానికి తెలిసింది. అయితే అప్పటి వరకూ వివిధ దేశాల్లో అనేక రోజుల్లో జరుపుకున్న మహిళా దినోత్సవం చివరగా 1914లో మార్చి 8న జరిగింది. అప్పటి నుంచీ ఈ రోజును ప్రపంచమంతా మహిళా దినోత్సవంగా జరుపుకుంటోంది.

నిజానికి ఇది అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవంగా చెప్పాలి. శతాబ్ధం క్రితం పనిలో భాగస్వామ్యం, సమాన పనికి సమాన వేతనం వంటి డిమాండ్స్ తో మొదలైన ఉద్యమం నుంచి వచ్చింది కాబట్టి ఈ రోజును అంతర్జాతీయ శ్రామికమహిళా దినోత్సవంగానూ పిలుస్తారు.. అంతేకాదు అన్ని బంధాలకు మూలమైన మహిళను సమున్నతంగా గౌరవిస్తామని ప్రతి ఒక్కరూ ప్రమాణం చేసుకోవాల్సిన రోజు కూడా.

మహిళా దినోత్సవం కూడా మనకు దిగుమతి అయిన పండగ లాంటిదే. అయినా ఇది ఆ పండగల్లా కాదు. స్త్రీ శక్తిని మళ్లీమళ్లీ మననం చేసుకునే అరుదైన అవకాశం. ఆమె శ్రమ శక్తిని గురించి లోకమంతా చెప్పుకునే సందర్భం. ఆ సందర్భాలను మనం తెలుగు సినిమాతో కలిపి పంచుకోవడం ఆనవాయితీగానూ వస్తోంది.

భారతదేశానికి మహిళా శక్తి అనే మాట కాస్త ఆలస్యంగా పరిచయం అయినా.. అందరికంటే వేగంగా దూసుకుపోయింది మన మహిళ. పితృస్వామ్య వ్యవస్థ నుంచి వచ్చినా.. తన శక్తిని చాటాల్సిన చోట ఎన్నడూ వెనకడుగు వేయలేదు.. అవసరమైతే పురాణాలను ఆదర్శంగా తీసుకుని నినదించింది మన మహిళ.

తెలుగులో మహిళా శక్తిని చాటిన సినిమాలు చాలా వచ్చాయి. వారినే స్ఫూర్తిగా తీసుకుని చేసిన చిత్రాలూ అనేకం ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకునేది కర్తవ్యం సినిమా గురించే. అయితే రియల్ లైఫ్ లోనూ పరుగుల రాణిగా పేరు తెచ్చుకున్న అశ్వనీ నాచప్ప తనే నటించిన సినిమాలూ ఎందరికో స్ఫూర్తినిచ్చాయ్.

ప్రాంతీయ ఉద్యమాల నుంచి ప్రపంచ రాజకీయాల వరకూ స్త్రీకి తెలియని విషయం ఏదీ లేదిప్పుడు. ఒకప్పుడులా పేరెంట్స్ ఏం చెబితే అది కాకుండా.. తను స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోగలదు. తన ఆత్మవిశ్వాసానికి ఏ భంగం లేకుండా తన కాళ్లపై తను నిలబడగలదు.. ఈ దిశగానూ మన సినిమా ఎదుగుతోంది..

మహిళా దినోత్సవం అంటే మనకు రక్తం పంచిన వారి రోజు. ఒక స్త్రీగా మన జీవితానికి అన్నీ అయ్యి.. ఎన్నో విధాలుగా ముందుకు నడిపిస్తోన్న ఆ మహిళ సమాజం నుంచి కోరుకునేది ఏంటో తెలుసా..? వారి ఆత్మగౌరవానికి భంగం కలగనివ్వని గౌరవం.. ఆత్మాభిమానాన్ని తగ్గించని నమ్మకం.. ఆ రెండూ మనం వారికి ఇవ్వాలి.. ఆకాశంలో కాదు.. ఈ నేలపైనా తనకు సగం ఇద్దాం.. అనునిత్యం ఆమెకు బాసటగా ఉంటామని బాస చేద్దాం.

Next Story

RELATED STORIES