ఏం నాయనా ఈ జన్మకు పెళ్లి చేసుకోవాలని లేదా.. మరి ఆ కోరిక ఏంటి?

ఏం నాయనా ఈ జన్మకు పెళ్లి చేసుకోవాలని లేదా.. మరి ఆ కోరిక ఏంటి?
నీకు పెళ్లి అవ్వడం.. నేను ప్రధాని కావడం రెండు ఒకటే

అమ్మాయి బావుంటే చాలు.. కట్నం వద్దు, కారు వద్దు.. ఇల్లు అసలే వద్దు, కానీ ఒకే ఒక్క చిన్న కోరిక.. లేచిన దగ్గర నుంచి ఫోన్ పట్టుకుని కూర్చునే అమ్మాయి వద్దు. సోషల్ మీడియాకు బానిసకాని అమ్మాయి కావాలంటూ ప్రకటన ఇచ్చాడు పశ్చిమ బెంగాల్ కమర్పూర్‌కు చెందిన ఓ వ్యక్తి.

37 ఏళ్ల చటర్జీ.. తనకు ఎటువంటి దురలవాట్లు లేవని.. హైకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నాని.. ఇళ్లు, కారు ఉన్నాయని ప్రకటనలో తెలిపాడు. తల్లిదండ్రులు ఉన్నారు. కమర్పుకుర్‌లో మరో ఇల్లు కూడా ఉంది. అందమైన, పొడవైన, సన్నని వధువు కావాలి.. ముఖ్యంగా ఆమె సోషల్‌ మీడియాకు అడిక్ట్‌ అవ్వకూడదని చటర్జీ కోరాడు.

అతడి యాడ్‌ చూసిన నెటిజన్లు 'ఏం నాయనా ఈ జన్మకు పెళ్లి చేసుకోవాలని లేదా.. మరి ఆ కోరిక ఏంటి? అంటూ కామెంట్ చేస్తున్నారు. మరి కొందరు నెటిజన్లు.. ఇదేం వివక్ష.. మహిళలకు సోషల్ మీడియా చూసే స్వేచ్ఛ కూడా లేదా అని మండి పడుతున్నారు. నీకు పెళ్లి అవ్వడం.. నేను ప్రధాని కావడం రెండు ఒకటే అంటూ మరో నెటిజన్ కామెంట్‌ చేశాడు.

పేపర్‌లో వచ్చిన ఈ యాడ్‌ని నితిన్‌ సాంగ్వాన్‌ అనే ఐఏఎస్‌ అధికారి వధువు / వరుడు విషయంలో ఆలోచనలు మారుతున్నాయి అంటూ ట్విట్టర్‌లో షేర్‌ చేశాడు. ప్రస్తుతం ఈ ప్రకటన సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.



Tags

Read MoreRead Less
Next Story