Minnal Murali Wedding Invitation: పిచ్చెక్కించారు.. సినిమా స్టైల్‌లో వెడ్డింగ్ ఇన్విటేషన్..!

Minnal Murali Wedding Invitation: పిచ్చెక్కించారు.. సినిమా స్టైల్‌లో వెడ్డింగ్ ఇన్విటేషన్..!
Minnal Murali Wedding Invitation: మిన్నాళ్ మురళీ క్యారెక్టర్‌ను అమితంగా ఇష్టపడిన ఓ వ్యక్తి తన వెడ్డింగ్ ఇన్విటేషన్..

Minnal Murali Wedding Invitation: ఈమధ్య ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్స్ కోసం వినూత్నంగా చేస్తున్నారు కపుల్స్. వెడ్డింగ్ ఇన్విటేషన్‌కు వీడియోల కోసం ఎంత ఖర్చు పెట్టడానికి అయినా వెనకాడట్లేదు. మిడిల్ క్లాస్ అయినా కూడా ఖరీదైన ప్రీ వెడ్డింగ్ షూట్స్ వెంటే పరిగెడుతున్నారు. అయితే ఈ క్రమంలో వారి క్రియేటివిటీ కూడా విపరీతంగా పెరిగిపోతోంది. ఒక సినిమా క్యారెక్టర్‌లో పెళ్లికొడుకు ఉండి.. పెళ్లికూతురిని తన ప్రియురాలిగా భావిస్తూ చేసిన ఓ వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇటీవల మలయాళంలో విడుదలై సూపర్ హిట్ అందుకున్న చిత్రం 'మిన్నాళ్ మురళి'. మలయాళంలో మాత్రమే కాదు.. ఈ సినిమా ప్రతీ భాషలో చూసిన వారి దగ్గర నుండి ప్రశంసలు అందుకుంటోంది. సింపుల్‌గా చెప్పాలంటే మిన్నాళ్ మురళి.. ఇండియన్ సూపర్ మ్యాన్. దర్శక ధీరుడు రాజమౌళి సైతం ఈ చిత్రం బాగుందంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఆ మిన్నాళ్ మురళీ క్యారెక్టర్‌ను అమితంగా ఇష్టపడిన ఓ వ్యక్తి తన వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియోలో తానే మిన్నాళ్ మురళిగా రెడీ అయ్యాడు. తనకు కాబోయే భార్యను రౌడీల నుండి రక్షించి.. తనను కాపాడుకుంటూ ప్రేమలో పడేస్తాడు. ఈ వెడ్డింగ్ ఇన్విటేషన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ కాన్సెప్ట్ క్రియేట్ చేసిన వారిని ప్రశంసిస్తున్నారు నెటిజన్లు. అంతే కాకుండా పలువురు సెలబ్రిటీలు కూడా ఈ వీడియోకు ఇంప్రెస్ అయ్యి తమ సోషల్ మీడియాలో షేర్ చేశారు కూడా.


Tags

Read MoreRead Less
Next Story