Naga Chaitanya: స్టేజ్‌పై కొత్త హీరోయిన్‌తో చైతూ.. వైరల్ అవుతున్న వీడియో..

Naga Chaitanya: స్టేజ్‌పై కొత్త హీరోయిన్‌తో చైతూ.. వైరల్ అవుతున్న వీడియో..
Naga Chaitanya: ‘బంగార్రాజు’ ప్రమోషన్స్ కోసం చైతూ అందరితో ఇంటరాక్ట్ అవ్వడం మొదలుపెట్టాడు.

Naga Chaitanya: నాగచైతన్య.. అక్కినేని వారసుడిగా సినిమాల్లోకి పరిచయమయినా కూడా.. కొంతకాలంలోనే లవర్ బాయ్‌గా మంచి పేరును సంపాదించుకున్నాడు. మొదటి సినిమా 'జోష్' అంతగా కమర్షియల్ సక్సెస్ సాధించకపోయినా.. 'ఏమాయ చేశావే'తో ఫార్మ్‌లోకి వచ్చాడు చైతూ. ఆ సినిమాలో జంటగా నటించిన సమంతనే కొన్నాళ్ల తర్వాత వివాహమాడాడు. ఇటీవల వీరు విడాకులు తీసుకున్నారు. ఇటీవల నాగచైతన్యకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

నాగచైతన్య.. సమంతతో విడాకుల తర్వాత పెద్దగా దీనిపై స్పందించలేదు. అంతే కాకుండా పెద్దగా బయటికి రావడం కూడా మానేశాడు. కానీ ఇటీవల తన చిత్రం 'బంగార్రాజు' ప్రమోషన్స్ కోసం చైతూ అందరితో ఇంటరాక్ట్ అవ్వడం మొదలుపెట్టాడు. తన తండ్రి నాగార్జునతో కలిసి చైతూ నటిస్తున్న చిత్రం బంగార్రాజు.. ఈ నెల 14న సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో స్టేజ్‌పై జరిగిన ఓ సంఘటన వైరల్‌గా మారింది.

బంగార్రాజు చిత్రంలో నాగార్జునకు జోడీగా రమ్యకృష్ణ, నాగచైతన్యకు జోడీగా కృతి శెట్టి నటిస్తున్నారు. వీరితో పాటు ఇంకా చాలామంది హీరోయిన్లు ఈ సినిమాలో ఉన్నారు. వారిలో ఒకరు దక్షా నాగర్కర్. అయితే బంగార్రాజు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నాగార్జున మాట్లాడుతుండగా.. నాగచైతన్య, దక్షా ఒకరినొకరు చూసి నవ్వుకున్నారు. అయితే చైతూ ప్రస్తుతం సింగిల్‌గా ఉన్నాడని, మింగిల్ అవ్వాలనుకుంటున్నాడని రకరకాలుగా కామెంట్స్ చేయడం మొదలుపెట్టేశారు నెటిజన్లు. అంతే కాకుండా ఈ వీడియో ఒక్కరోజులోనే విపరీతంగా వైరల్ అయ్యింది.

Tags

Read MoreRead Less
Next Story