Viral Video: వావ్ బామ్మ.. కుర్రాళ్లకు పోటీ ఇస్తున్నావ్..!

Viral Video: వావ్ బామ్మ.. కుర్రాళ్లకు పోటీ ఇస్తున్నావ్..!
Viral Video: ఈ వీడియోలో ఓ బామ్మ స్పోర్ట్స్ బైక్ నడుపుతోంది.

Old lady riding a bike: బైక్ రైడ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదో చెప్పండి. అది యమహా R15 బైక్ అంటే.. కుర్రాళ్లు ఎగిరి గంతులేస్తారు. యువకులు ఎంతో ఇష్టపడే బైక్ ఓ బామ్మ నడపడం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. యువకులను తాను ఏమాత్రం తీసిపోనని చెప్పసాగింది. ఈ వీడియోలో ఓ బామ్మ స్పోర్ట్స్ బైక్ నడుపుతోంది. కెమెరా వైపు చూసి నవ్వుతూ R15ను నడుపుతుంది. బామ్మ ఉత్సాహాన్ని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోయారు. ఆ ములసలావిడను అభినందిస్తున్నారు.

అయితే వీడియో ఎక్కడ, ఎవరు తీశారు అనేదానిపై స్పష్టత లేదు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ యూజర్ _shubham_5x అనే వ్యక్తి పోస్ట్ చేశారు. ఈ వీడియోను 78.4 మిలియన్లకు పైగా వీక్షించారు. 5.5 మిలియన్ల పైగా లైక్స్ వచ్చాయి. ఓ వావ్ బామ్మ సూపర్ అంటూ కామెంట్ చేశాడు. ఇక మరో నెటిజన్ బామ్మకు ఎవరో సహాయం చేస్తున్నారని అంటే.. ఆ బైక్ ఆమె నడపడంలేదు... వెనక నుంచి తోస్తున్న్నారు అంటూ కొందరు నెటిజన్లు అనుమానిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.



Tags

Read MoreRead Less
Next Story