ఈ పెయింటింగ్ ధర అక్షరాల రూ.670 కోట్లు!

అక్కినేని నాగార్జున, తమిళ హీరో కార్తి హీరోలు గా వచ్చిన ఊపిరి సినిమా గుర్తుంది కదా.. ఈ సినిమాలో నాగార్జున ఒక పెయింటింగ్‌ను రూ.20 లక్షలకు కొనుగోలు చేస్తే కార్తి షాక్ అవుతాడు..

ఈ పెయింటింగ్ ధర అక్షరాల రూ.670 కోట్లు!
X

అక్కినేని నాగార్జున, తమిళ హీరో కార్తి హీరోలు గా వచ్చిన ఊపిరి సినిమా గుర్తుంది కదా.. ఈ సినిమాలో నాగార్జున ఒక పెయింటింగ్‌ను రూ.20 లక్షలకు కొనుగోలు చేస్తే కార్తి షాక్ అవుతాడు.. అలాగే ఈ పైనున్న పెయింటింగ్ ధర తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు మరి! ఇట‌లీలో 1440-1510 మధ్య జీవించిన ప్రఖ్యాత చిత్రకారుడు సాండ్రో బొటిసెల్లి వేసిన ఈ పెయింటింగ్ వేలంలో రికార్డు ధర పలికింది. ఏకంగా 92.2 మిలియన్‌ డాలర్లు.. ఇండియన్ కరెన్సీలో రూ.670 కోట్లకు అమ్ముడుపోయింది. ఈ చిత్రాన్ని ఇటీవ‌లే న్యూయార్క్‌లో వేలం వేశారు. కాగా సాండ్రో బొటిసెల్లి గీసిన ఎన్నో చిత్రాలు గతంలో కూడా వేలానికి వచ్చాయని, అయితే వాటిలో ఏ ఒక్కటి కూడా ఈ స్థాయిలో ధర పలకలేదని తెలిపారు నిర్వాహకులు.

Next Story

RELATED STORIES