ప్రాణాలకు తెగించి మరీ రైల్వే ఉద్యోగి సాహసం

మహారాష్ట్రలో రైల్వే ఉద్యోగి ప్రాణాలకు తెగించి మరీ చేసిన సాహసం వైరల్ అవుతోంది. హాలీవుడ్ యాక్షన్ సినిమాను తలపించే రీతిలో ఓ బాలుడి ప్రాణాలు కాపాడాడు.

ప్రాణాలకు తెగించి మరీ రైల్వే ఉద్యోగి సాహసం
X

మహారాష్ట్రలో రైల్వే ఉద్యోగి ప్రాణాలకు తెగించి మరీ చేసిన సాహసం వైరల్ అవుతోంది. హాలీవుడ్ యాక్షన్ సినిమాను తలపించే రీతిలో ఓ బాలుడి ప్రాణాలు కాపాడాడు. మహారాష్ట్రలోని వంగని రైల్వేస్టేషన్ లో ఓ మహిళ తన కుమారుడితో కలిసి ప్లాట్ ఫాంపై నడుస్తున్న సమయంలో.. ప్రమాదవశాత్తూ బాలుడు పట్టాలపై పడిపోయాడు. అయితే అదే సమయంలో పట్టాలపై నుంచి రైలు వస్తోంది. దీంతో ఆ తల్లి బాధతో కేకలు వేస్తూ నిస్సహాయస్థితో ఉండిపోయింది. అంతలో అక్కడే ఉన్న రైల్వే గార్డు మయూర్ షెల్కే పట్టాలపై పరుగెత్తుకుంటూ వచ్చి రెప్పపాటులో బాలుడిని కాపాడాడు. ఇండియన్ రైల్వేస్ ఈ వీడియోను తన ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేయడంతో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆ గార్డుపై రియల్ హీరో అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

Next Story

RELATED STORIES