రూ. కోటి ధర పలికిన గొర్రె.. అమ్మను పొమ్మన్న యజమాని

రూ. కోటి ధర పలికిన గొర్రె.. అమ్మను పొమ్మన్న యజమాని
బక్రీద్‌ వేళ రూ. కోటి పలిగిన గొర్రె...అయినా విక్రయించనన్న యజమాని... గొర్రె శరీరంపై ఇస్లాం పవిత్ర సంఖ్యలు...

ముస్లింల పర్వదినం బక్రీద్‌ వేళ ఓ గొర్రెకు పలికిన ధర చూసి దేశం మొత్తం ఆశ్చర్యపోయింది. సాధార‌ణంగా ఒక గొర్రె ధ‌ర రూ.5 నుంచి రూ.10 వేల మధ్యలో ఉంటుంది. మంచి జాతి గొర్రె అయితే 30 వేల రూపాయల వరకూ ఉంటుంది. రాజస్థాన్ లో ఓ వ్యక్తికి చెందిన గొర్రె పిల్లకు ఏకంగా కోటి రూపాయల ధర పలికింది. అయినా కూడా ఆ గొర్రెను అమ్మేందుకు దాని యజమాని రాజు సింగ్ తిరస్కరించారు. రాజస్థాన్‌లోని చురు జిల్లా తారానగర్‌ కి చెందిన రాజు సింగ్ కు సంబంధించిన ఓ గొర్రె పిల్లను వేలం వేయగా ఏకంగా కోటి రూపాయల ధర పలికింది. అయితే దాన్ని అమ్మేందుకు మాత్రం ఆయన నిరాకరించాడు. గొర్రె తనకు ఎంతో ప్రియమైందని, కాబట్టి దీన్ని అమ్మలేనని ఆయన అన్నారు.


ఇప్పుడు ఇది రాజస్థాన్‌ సహా దేశమంతా సంచలనంగా మారింది. ఈ గొర్రెపిల్ల శరీరంపై ఉన్న 786 అనే అంకె ముస్లింలకు చాలా పవిత్రంగా భావిస్తారు. ఇస్లాంలో ఈ అంకెకు చాలా ప్రాధాన్యం ఉంది. గొర్రెపిల్ల శరీరంపై ఉన్నది ఎంటో తెలియదని యజమాని రాజు సింగ్ తెలిపారు. ముస్లిం వర్గానికి చెందిన కొందర్ని సంప్రదిస్తే ఈ విషయం తెలిసిందని ఆయన చెప్పారు. ముస్లింలకు ఎంతో పవిత్రమైనది అయినప్పటికీ.. ఈ గొర్రె అంటే తనకు చాలా ఇష్టం అని అందుకే దీన్ని అమ్మడం లేదని చెప్పాడు. గతేడాది ఓ ఆడగొర్రెకు ఈ గొర్రెపిల్ల జన్మించింది. వేలం వేస్తున్న సమయంలో ఏకంగా 70 లక్షలు నుంచి కోటి రూపాయలు ఇస్తామన్నారని తెలిపాడు. గొర్రె పిల్లకు భారీ ధర రావడంతో ఇప్పుడు రాజు సింగ్ దాన్ని ప్రత్యేక శ్రద్ధతో చూస్తున్నాడు. దానికి దానిమ్మ, బొప్పాయి, మినుములు, పచ్చి కూరగాయలను ఆహారంగా ఇస్తున్నాడు. భద్రతా కారణాలతో ఇప్పుడు ఆ గొర్రెను తన ఇంటిలోనే ఉంచుతున్నాడు.

Tags

Read MoreRead Less
Next Story