ఏడుగురితో బైక్ పైన... దండం పెట్టిన కానిస్టేబుల్..!‌

సాధారణంగా అయితే బైక్ పైన ఇద్దరు వెళ్తారు లేదా ముగ్గరు వెళ్తారు. ఇద్దరి వరకు ఒకే కానీ.. ముగ్గురు వెళ్ళడం అనేది ట్రాఫిక్ రూల్స్ ప్రకారం విరుద్దం..

ఏడుగురితో బైక్ పైన... దండం పెట్టిన కానిస్టేబుల్..!‌
X

సాధారణంగా అయితే బైక్ పైన ఇద్దరు వెళ్తారు లేదా ముగ్గరు వెళ్తారు. ఇద్దరి వరకు ఒకే కానీ.. ముగ్గురు వెళ్ళడం అనేది ట్రాఫిక్ రూల్స్ ప్రకారం విరుద్దం.. అయితే ఇక్కడో వ్యక్తి బైక్ పైన ఏకంగా ఏడుగురిని ఎక్కించుకొని వెళ్తున్నాడు. ఇందులో ముగ్గురు పెద్దవాళ్ళు కాగా, నలుగురు చిన్నపిల్లలు ఉన్నారు. దీనికి తోడు లగేజీ కూడా ఉంది. ఈ ఘటన వికారాబాద్‌ జిల్లా బషీరాబాద్‌ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఇలా ఏడుగురితో బైక్ పైన వెళ్తుండగా పోలీసు తనిఖీల్లో భాగంగా మల్లేశం అనే కానిస్టేబుల్‌ అడ్డుకున్నాడు. నీకో దండమయ్యా.. ఇది బైక్ అనుకున్నావా.. ఎడ్ల బండనుకున్నావా? అని అతడికి రూ.1,200 జరిమానా విధించాడు. ఈ ఫోటోను వికారాబాద్‌ పోలీసులు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో వైరల్ గా మారింది. దీనిపైన నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

Next Story

RELATED STORIES